రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు.. అజిత్‌ పవార్‌ చుట్టూనే వ్యూహాలు..!

0
451

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు.. ఏమి జరగబోతోందా అనే టెన్షన్ వెంటాడుతూ ఉంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం షిండే శివసేన వర్గం, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. షిండే వర్గం మాత్రం అజిత్ పవార్ వర్గాన్ని దూరం పెట్టాలని బీజేపీ అధిష్టానానికి ఒక హెచ్చరిక పంపించింది. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేరుగా బీజేపీతో కలవదని తాము భావిస్తున్నామని.. ఎన్సీపీ గురించి తమ విధానం స్పష్టంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నామని.. ఎన్సీపీతో కలిసి ఉండబోమని.. బీజేపీ ఎన్సీపీతో చేతులు కలపడం మహారాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఎన్సీపీని వీడుతున్నట్లు అజిత్‌ పవార్‌ చెప్పలేదని, ఒకవేళ అజిత్ పవార్ ఎన్సీపీని వీడితే తాము స్వాగతిస్తామని చెప్పారు. అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థా పవార్‌ ఎన్నికల్లో ఓడిపోవడం వల్లే ఆయన అసంతృప్తితో ఉన్నారన్నారు.