National

మౌనం వీడిన శిల్పా శెట్టి..!

బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..! 2009లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన భర్త అరెస్టైన తర్వాత శిల్పాశెట్టి తొలిసారి స్పందించింది.

ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ రచించిన పుస్తకంలోని వాక్యాలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘కోపంలో ఉన్నప్పుడు వెనక్కి చూడకు, భయంగా భవిష్యత్తును చూడకు, పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు అంటాడు జేమ్స్ థర్బర్. మనల్ని బాధ పెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అనే భయంతోనో, ఏదైనా రోగం బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం. నేను బతికే ఉన్నాననే విషయం తెలుసుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటా. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఈరోజు నేను జీవించడాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు’ అనే వాక్యాలను ఆమె షేర్ చేసింది. ఈ కేసు గురించి బయటకు తెలిసిన తర్వాత శిల్పా శెట్టిని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు.

Shilpa Shetty Breaks Silence On Husband Raj Kundra Arrest In Porn Case,  Talks About Surviving Challenges - THE MEABNI

కొన్ని మీడియా సంస్థలు రాజ్ కుంద్రా ఆదాయాన్ని కూడా ప్రచురించాయి. రాజ్ కుంద్రా అతని సంస్థ ఒక రోజులో HotHit నుండి బాగా ఆర్జించినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా HotHit నుండి రోజుకు ఒకటి నుండి 10 లక్షల రూపాయలు సంపాదించేవారు. ఈ డబ్బును తన బ్యాంకు ఖాతా బదిలీ చేసుకునేవారని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. రాజ్ కుంద్రా తన సోదరుడు ప్రదీప్ బక్షి యాజమాన్యంలోని యుకెకు చెందిన కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ యాప్‌ను అమ్మారు. రాజ్ ముంబై నుండి కార్యకలాపాలను నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది.

అరెస్టు నుండి తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున లంచం:

తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్‌కుంద్రా భారీగా లంచం ఇచ్చాడని తెలుస్తోంది. తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ అలియాస్‌ యశ్‌ ఠాకూర్‌ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా రాజ్‌ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మార్చిలో ఏసీబీకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు. తాజాగా ఈమెయిల్‌ను ఏసీబీ పోలీస్‌ కమిషనర్‌కు పంపింది. అంధేరిలోని రాజ్‌కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్‌ మూవీస్‌ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్‌ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్‌ చేయమని ఓ పోలీస్‌ రాయబారం చేసినట్లు ఈమెయిల్‌లో అరవింద్‌ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + five =

Back to top button