More

    ఆమెపై 50కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. రాజ్ కుంద్రా జైలులో ఉన్న సమయంలో పలువురు సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షెర్లిన్ పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్ పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. శిల్ప, రాజ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని.. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. షెర్లిన్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

    షెర్లిన్ చోప్రా శ్రీ రాజ్ కుంద్రా మరియు శ్రీమతి శిల్పా శెట్టి కుంద్రాపై చేసిన మొత్తం ఆరోపణలు నిరాధారణమైనవని రాజ్ కుంద్రా-శిల్పా తమ స్టేట్మెంట్ లో తెలిపారు. షెర్లిన్ చోప్రా ఎటువంటి ఆధారాలు లేకుండా.. అబద్ధమైన పరువు తీయడానికి మరియు దోపిడీ చేయడానికి ఒక రహస్య ఉద్దేశ్యంతో ఆరోపణలు చేశారని ఆరోపించారు. అనవసరమైన వివాదాన్ని సృష్టించడానికి మరియు మీడియా దృష్టిని ఆకర్షించడానికి శ్రీమతి శిల్పా శెట్టి పేరును లాగడానికి షెర్లిన్ చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని.. షెర్లిన్ చోప్రాను నోడల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో C.R. నంబర్ 02/2020 లో నిందితురాలిగా అభియోగాలు మోపామని శిల్ప, రాజ్ తరపు న్యాయవాది తెలిపారు. షెర్లిన్ చోప్రా, ఇండియన్ పీనల్ కోడ్, 1860 లోని 499, 550, 389 మరియు 195 (A), నేరాలకు పాల్పడింది.. మాకు భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది.. మేము షెర్లిన్ చోప్రాపై రూ .50 కోట్ల పరువునష్టం దావా వేశామని శిల్ప, రాజ్ తరపు న్యాయవాది తన స్టేట్మెంట్ లో పొందుపరిచారు.

    కుంద్రా తనను అశ్లీల చిత్రాల కోసం మోసగించాడని గతంలో షెర్లిన్ చోప్రా ఆరోపించింది. రాజ్ కుంద్రా నాకు గురువు. నేను చేసేది గ్లామర్ కోసమే అని భరోసా ఇవ్వడం ద్వారా అతను నన్ను తప్పుదోవ పట్టించాడు. శిల్పా శెట్టికి నా వీడియోలు మరియు ఫోటోలు అంటే చాలా ఇష్టం అని కూడా అతను నాకు చెప్పాడు. నేటి కాలంలో సెమీ న్యూడ్ మరియు పోర్న్ పెద్ద విషయం కాదని రాజ్ కుంద్రా నాకు నమ్మకం కలిగించారని ఆమె చెప్పుకొచ్చింది. రాజ్ కుంద్రా అశ్లీల కేసుతో చిక్కుకుని.. జూలైలో అరెస్టు అయ్యాడు.

    Trending Stories

    Related Stories