ఓ వైపు రాజీనామా.. మరోవైపు సోదాలు..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేశారు. వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శిల్పా శెట్టికి సమన్లు పంపుతారన్న ఊహాగానాలు వచ్చాయి. రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్‌కు శిల్పా శెట్టి రాజీనామా చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విచారణ నిమిత్తం రాజ్ కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. రాజ్ కుంద్రా తన అరెస్ట్ ను బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రా సవాల్ చేశారు. ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని చెప్పారు. ఒరిజనల్ ఎఫ్ఐఆర్లో తన పేరు లేదన్నారు. తన అరెస్టు తర్వాతే సీఆర్పీసీ41ఏ నోటీసుపై సంతకం చేయించుకున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు.
రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత శిల్పా శెట్టి గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అయ్యాయి. కుంద్రా చేసిన తప్పుల గురించి సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు శిల్పాపై ఆరోపణలు ఉన్నాయి. కుంద్రాకు చెందిన అడల్డ్ కంటెంట్ సంస్థ ‘కెన్రిన్’లో శిల్పా భాగస్వామిగా ఉన్నారని, చాలా మంది ఈ సినిమాల చిత్రీకరణలో నటించడానికి ముందు శిల్పాతో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రాజ్‌కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పా భాగస్వామిగా ఉన్నారు. వయాన్ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ‘వయాన్ ఇండస్ట్రీస్’ డైరెక్టర్‌గా శిల్పా శెట్టి ఎన్ని రోజులు పనిచేశారో తెలుసుకోవడానికి కూడా తెలుసుకుంటున్నారు. ఆమెను ప్రశ్నించేందుకు అవకాశాలు ఉన్నాయి. యాప్‌ల కోసం డిజిటల్ కంటెంట్‌ను హోస్ట్ చేసే సర్వర్ నుంచి డాటాను తొలగించిన వ్యక్తి కోసం కూడా దర్యాప్తు బృందం వెతుకుతోంది. ఆ డాటాను పునరుద్ధరించడానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. శిల్పా బ్యాంక్ ఖాతాలో ఈ యాప్ నుంచి సంపాదించిన పెద్ద మొత్తాన్ని కుంద్రా చాలాసార్లు వేశాడు. కుంద్రా హాట్‌షాట్స్ యాప్‌లో 20 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారని ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది.
శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం పలు అంశాలపై ప్రశ్నించారు. శిల్పాను దాదాపు 6 గంటలపాటు పోలీసులు విచారించారు. తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, రాజ్ కుంద్ర పేరును బంధువు, వ్యాపార భాగస్వామి అయిన ప్రదీప్ భక్షి దుర్వినియోగం చేశారని విచారణలో పోలీసులకు చెప్పిందనే ప్రచారం సాగుతోంది.