పాకిస్తాన్ లో షియా ముస్లింలపై దాడి..!

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ముహర్రం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించిన ఊరేగింపుపై దాడి చేశారు. ఊరేగింపుపై జరిగిన పేలుడు కారణంగా ముగ్గురు మరణించారు, 59 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న రద్దీగా ఉండే బహవల్‌నగర్ పరిసరాల్లో ఊరేగింపు వెళుతున్నప్పుడు తమపై దాడి చేశారని షియా నాయకుడు ఖావర్ షఫ్కాత్ ధృవీకరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆశురా ఊరేంగింపు చేయడం నచ్చని సున్నీ ముస్లింల బృందం షియా బృందంపై బాంబు దాడికి పాల్పడిందని అధికారులు భావిస్తూ ఉన్నారు.
ఈ ఘటన కారణంగా అధికారులు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. ఊరేగింపుపై క్రాకర్స్ విసిరి దాడి చేసిన ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షియా నాయకులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. నిర్వహించబోయే పలు కార్యక్రమాలపై దాడి చేసే అవకాశం ఉందని ఇతర ప్రణాళికాబద్ధమైన ఊరేగింపులకు అధిక భద్రతను ఇవ్వాలని కోరారు. ఎక్కడ అల్లర్లు చెలరేగి మరింత ఉద్రిక్తంగా మారుతుందోనని అధికారులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.
ఆశురా అనేది ముస్లింలందరూ అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన ముహర్రం 10 వ రోజు. ముహమ్మద్ ప్రవక్త మక్కాలో ఆ రోజు ఉపవాసం ఉండేవారు. ఆ తర్వాత ఇది సాధారణ సంప్రదాయంగా మారింది. స్వచ్ఛందంగా ఉపవాసం ఉండే సున్నీ ముస్లింలు అనుసరిస్తారు. షియా ముస్లింలు క్రీ.శ 680 లో కర్బలా యుద్ధంలో మరణించిన ప్రవక్త ముహమ్మద్ మనవడు హుసేన్ ఇబ్న్ అలీ అల్-హుస్సేన్ మరణానికి గుర్తుగా ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తారు.