More

    భారత ప్రభుత్వ సొమ్ముతో డాక్టర్ చదువుతూ.. భారత్ ఓడిపోగానే సెలెబ్రేషన్స్

    టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ పై పాకిస్తాన్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొదలైనప్పటి నుండి పాకిస్తాన్ జట్టు దూకుడుగా ఆడింది. 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. భారత్ ఓడిపోగానే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పాక్ క్రికెట్ అభిమానులు ప్రపంచ కప్ లో భారత్ పై గెలవాలని ఎదురుచూసారు. అది ఆదివారం నిజమవ్వడంతో పట్టలేని సంతోషంతో సందడిగా గడిపారు. ప్రతి సారీ భారత్-పాక్ మ్యాచ్ ల సమయంలో పాకిస్తాన్ లో టీవీలు పగిలేవి.. ఈసారి మాత్రం అలా జరగలేదు.

    పాకిస్తాన్ లో సంబరాలు చేసుకోవడం సహజం. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ మోనికా లంకేశ్ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ వీడియో స్కిమ్స్(Sher-I-Kashmir Institute of Medical Sciences) కు సంబంధించింది. శ్రీనగర్ లోని వైద్య కళాశాలలో భారత జట్టు ఓడిపోగానే అక్కడి యువకులు పెద్ద ఎత్తున విజయ నినాదాలు చేశారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పాకిస్తాన్ కు మద్దతుగా విజయ నినాదాలు చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన మోనికా లంకేశ్ వారందరూ పీజీ, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వ డబ్బుతో వాళ్లు చదువుకుంటూ ఉన్నారని మోనికా తెలిపారు. ఇలాంటి వారంతా ఉచితంగా ఎంబీబీఎస్ లు పూర్తీ చేస్తారని.. భారత్ కు వైద్య రంగంలో సేవ చేస్తారని మనం భావించకూడదని మోనికా తెలిపారు. భారత్ మీద ద్వేషాన్ని ఇలాంటి వ్యక్తులు పెంపొందిస్తూ ఉంటారని విమర్శించారు. జమ్మూ లోని పలు ప్రాంతాల్లో భారత్ ఓడిపోగానే బాణాసంచా కాల్చి పాక్ జెండాలను పట్టుకుని వీధుల్లో తిరుగుతున్న వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.

    Related Stories