More

    ముస్లిం దేశంలో హింద్ సిటీ.. ప్రకటించిన దుబాయ్ పాలకుడు..!

    ప్రపంచ దేశాలు హిందూ మతం వైపు మొగ్గు చూపుతున్నాయి. అలాగే ఇతర దేశాల్లో హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ముస్లిం దేశాల్లోనూ హిందువులకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ దేశాల్లో ఇప్పుడిప్పుడే హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. ఇన్నాళ్ళూ పూర్తి మత ఉన్మాదంతో వ్యవహరించిన అరబ్ దేశాలు సర్వ మతాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ లో ఓ ప్రాంతానికి పేరు మార్చడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రాంతాన్ని హింద్ సిటీగా పేరు మార్చారు. దుబాయ్ పాలకుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అల్ మిన్హాద్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలను ‘హింద్ సిటీ’గా మార్చారు. నగరంలో నాలుగు జోన్‌లు ఉన్నాయి. ఎమిరేట్స్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్, జెబెల్ అలీ-లెహ్‌బాబ్ రోడ్‌లతో సహా ప్రధాన రహదారులు ఉన్నాయి. నగరంలో ఎమిరాటీ పౌరుల గృహాలు అధికంగా ఉన్నాయి.

    ఇక గతేడాది అక్టోబర్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొత్తగా హిందూ ఆలయం కూడా ప్రారంభమైంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు ప్రారంభమైంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరుపుకున్న ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్ ఆలయానికి పొడగింపు. సింధీ గురుదర్బార్ యూఏఈలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి.

    ప్రస్తుతం నిర్మితమైన హిందూ దేవాలయం కోసం దశాబ్ధాల నుంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంత ప్రజలకు ప్రార్థనా స్థలం ఉండాలని అక్కడి హిందువుల డిమాండ్ చేశారు. అరబిక్-హిందూ శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దేవాలయం ముఖభాగంలో మొత్తం 16 మంది దేవీదేవతలో అలంకరించబడ్డాయి. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి దేవాలయం పాక్షికంగా తెరుచుకుంది. అప్పటి నుంచి యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు దేవాలయాన్ని సందర్శిస్తున్నారు.

    ఆలయ నిర్వాహకులు ఆలయదర్శనం కోసం ఆన్లైన్ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించారు. ఆలయ దర్శనానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చారు. కొత్తగా తెరుచుకున్న ఈ హిందూ ఆలయం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాల కోసం తెరిచి ఉంచుతారు. రోజుకు కేవలం 1000-1200 మంది భక్తులకు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది. కేవలం పరిమిత సంఖ్యలోనే దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. ప్రతీ గంటలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఇక ఆలయం వెబ్ సైట్ లో బుక్ చేసుకున్నవారు ఎలాంటి పరిమితులు లేకుండా దేవాలయాన్ని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్ లోని బెజెల్ అలీలోని ‘ వర్షిప్ విలేజ్’లో ఈ దేవాలయం ఉంది. ఈ ప్రదేశంలో అనేక చర్చిలు, గురుద్వారాలు, దేవాలయాలు ఉన్నాయి.

    అయితే ఈ నగరానికి పెట్టిన పేరుపై దుబాయ్ ఇప్పటికీ ఒక క్లారిటీని ఇవ్వలేదు. దీంతో ఇది నిజంగా హిందువుల కోసమే పెట్టారా..? లేక యాధృశ్చికంగా వచ్చిందా..? అన్న దానిపై సందేహాలున్నాయి. కొంతమంది ఇది హిందూ పేరు అని భావిస్తున్నా,.. మరి కొంతమంది ఇది దుబాయ్ రాణి పేరేమో అని భావిస్తున్నారు. పేరు మార్చిన దుబాయ్ పాలకుడు షేక్ మొహ్మద్ బిన్ రషీద్ మొదటి భార్య పేరులో హింద్ అనే పదం ఉంది. ఆమె పూర్తి పేరు హింద్ బింట్ మక్తూమ్ అల్ మక్తూమ్ కావడంతో ఈ పేరును ఆమె కోసమే పెట్టారనే ప్రచారం కూడా కొనసాగుతోంది.

    Trending Stories

    Related Stories