More

    షర్మిల యాత్ర ఆ రోజే మళ్ళీ మొదలు.. ఈసారి అక్కడి నుంచే షురూ..!

    తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు వైస్ షర్మిల శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఐతే గత కొద్దీ రోజులుగా వైస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అలాగే తెలంగాణలో వైఎస్సార్ పాలన తిరిగి తీసుకువస్తామని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

    తెలంగాణలో తాలిబన్ల పాలన సాగుతుందని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదన్నారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ నాయకుల మాటలకు బెదిరిపోమన్నారు. వైఎస్సార్‌టీపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిసెంబర్ 4 నుంచి 14వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని షర్మిల తెలిపారు.

    హైదరాబాద్ లోటస్ పాండ్‎లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశామయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ వ్యవహార శైలి, పోలీసు నిర్బంధాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు, పాదయాత్ర కొనసాగింపుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం పార్టీ నేతలతో కలిసి డీజీపీ కార్యాలయంలో డీజీ జితేందర్‌ను కలిసిన షర్మిల పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు.

    Trending Stories

    Related Stories