మానవ బాంబుగా మారిన షైరీ బలూచ్ బ్యాక్ గ్రౌండ్..!

0
1011

ఇద్దరు పిల్లల తల్లి, ఏ బాదరబందీ లేని ఫ్యామిలీ, భావి పౌరులకు భవిష్యత్తు పాఠాలు చెప్పే టీచర్ ఉద్యోగం చేసే షైరీ బలూచ్ సూసైడ్ బాంబర్ గా ఎందుకు మారింది..? ఉన్నత చదువులు చదివిన ఈ మహిళ.. పాకిస్తాన్ లో చైనా పౌరుల్ని ఎందుకు టార్గెట్ చేసింది..? తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి ఎందుకు పాల్పడింది…? చైనా అంటే ఆమెకు ఎందుకంత కక్ష..? బలూచిస్తాన్ లో తొలి సూసైడ్ బాంబర్ గా మారిన షైరీ.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? తన భార్య ను చేసిన పనిచూసి భర్త ఎందుకు గర్వపడుతున్నాడు..? ఈ ప్రశ్నల జవాబుల కోసం ఇప్పుడు ప్రపంచం అంతా వెతుకుతోంది. ఇంత వరకు ఎవ్వరూ చెప్పని ఎక్స్ క్లూజివ్ డిటెయిల్స్ మీకోసం.

పాకిస్తాన్ లోని కరాచీలో 2022 ఏప్రిల్ 26న జరిగిన ఆత్మాహుతి దాడి అటు పాకిస్థాన్, చైనాతోపాటు ప్రపంచ దేశాల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. బలూచిస్తాన్ లిబర్ రేషన్ ఆర్మీకి చెందిన షైరీ బలోచ్ మానవ బాంబుగా మారింది. ఆమె చదువు సంధ్యలేని మహిళ కాదు. అలాగని వంటింటికే పరిమితమైన సాధారణ మహిళ కూడా కాదు. బాగా చదువుకుంది. . ఎప్పుడు సరదాగా.. సంతోషంగా గడిపే ఫ్యామిలీ కూడా ఉంది. బలూచిస్తాన్ లోని తుర్బత్ లో కుటుంబంతో కలసి ఉంటోంది. ఆమె ఎడ్యూకేషన్ డిటెయిల్స్ అందరినీ షాక్ కు గురిచేస్తాయి. క్వెట్టాలోని బలూచిస్తాన్ యూనివర్సిటీలో జువాలజీలో మాస్టర్ డిగ్రీ చేసింది. అల్లామా ఇక్బాల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసింది. పాకిస్తాన్ లోని ఒక సెకండరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. 30ఏళ్ల వయసున్న షైరికి దేశభక్తి ఎక్కువ. మాతృభూమి బలూచిస్తాన్ కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉండేది. తనపై కుటుంబ బాధ్యతలు ఉన్నా.. అవి.. ఆమెను మానవ బాంబుగా మారడాన్ని ఆపలేక పోయాయి.

షైరీకి 8ఏళ్ల కూతురు, 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త హబితాన్ బషీర్ డెంటల్ డాక్టర్. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. బాబాయి మంచి రచయిత. ఆత్మాహుతి దాడి జరిగిన రోజు నుంచి షైరీ భర్త అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. భార్య ప్రాణత్యాగాన్ని చూసి భర్త ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాడు. గుర్తు తెలియని ఒక ప్రాంతం నుంచి ట్వీట్ చేశాడు. అందులో.. షైరీ జాన్ నిస్వార్థంతో నువ్వు చేసిన పనిని చూసి నాకు నోట మాట రావడంలేదు. నేను ఎంతో గర్వపడుతున్నాను. మా తల్లి మహా యోధురాలు అని… మన పిల్లలు మెహరోచ్, మీర్ హసన్ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నువ్వు మా జీవితంలో ఎప్పుడూ భాగస్వామిగా ఉంటావు… అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

షైరీతోపాటు.. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నత చదువులు చదివారు. మరి.. ఆమె ఆత్మాహుతి దాడికి ఎందుకు పాల్పడంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ లో రెండేళ్ల క్రితం జాయిన్ అయింది షైరీ. ఆమె స్వయంగానే అందులో వాలంటీర్ గా చేరింది. ఆత్మాహుతి దాడికి తాను సిద్దమని షైరీ స్వయంగా చెప్పింది. కుటుంబం ఉన్న నేపథ్యంలో… ఆమె తీసుకున్ననిర్ణయంపై పునరాలోచించాలని BLA కూడా షైరీకి సూచించింది. అయితే.. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆమె కుటుంబానికి కానీ.. ఫ్యామిలీ మెంబర్స్ కు కానీ.. BLAలో ఎలాంటి సంబంధాలు లేవు. అయినా.. షైరీ మానవ బాంబు గా మారాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అంతా అనుకున్నారు.

షైరీ ఫ్యామిలీ విషయంలో పాకిస్తాన్ మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె తండ్రితోపాటు.. సోదరుడిని పాకిస్థాన్ ఆర్మీ హత్య చేసిందని.. ఆమె భూమిని చైనా చేపడుతున్న ప్రాజెక్ట్ కు పాకిస్తాన్ బలవంతంగా ఇచ్చేసిందని… అందుకే ఆమె చైనా పై కక్ష పెంచుకుందని అక్కడి మీడియా చెప్తోంది. మరోవైపు.. స్టూడెంట్ గా ఉన్న సమయంలోనే బలూచిస్తాన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆజాద్ లో మెంబర్ గా ఉండేదని.. 2018లో జరిగిన ఒక ఆర్మీ క్యాంపెయిన్ లో సోదరుడిని హత్య చేశారని.. కూడా మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి.. చీకు చింతా లేని కుటుంబంతోపాటు.. వైవాహిక జీవితాన్నివదిలేసి మానవ బాంబుగా మారాలని నిర్ణయించుకుంది షైరీ. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం బలూచిస్తాన్ విద్రోహ చరిత్రలో కొత్త అధ్యాయమంటోది BLA. ఒక మహిళ మానవ బాంబుగా మారి దాడికి పాల్పడటం చరిత్రలో తొలిసారి జరిగింది. మరోవైపు.. షైరీ బలోచ్ ఆత్మాహుతి దాడి.. పాకిస్తాన్ పరేషాన్ చేస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

6 − five =