శివలింగాన్ని పురుషాంగంతో పోల్చిన మౌల్వీ..!

0
1012

మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. మరోసారి జ్ఞానవాపి శివలింగంపై మౌల్వీ ఇలియాస్ ఫక్రుద్దిన్ విషం చిమ్మాడు. అవమానకరమైన మాటలు మాట్లాడాడు. హిందూ దేవీ దేవతలను, పూజలను తూలనాడాడు.

హిందువులు ప్రైవేట్ పార్ట్స్ ను ఎందుకు పూజిస్తారు అంటూ.. కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ.. వికటాట్ట హాసం చేశాడు. మౌల్వీ చేసిన విద్వేష వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా హిందువులు ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్న షరాఫుద్దిన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. షరాఫుద్దిన్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జ్ఞానవాపి విషయంలో జాతీయ ఛానళ్లలో ప్రతి రోజు డిబేట్లు పెట్టడం.. ఇందులో పాల్గొన్న ముస్లిం మతానికి చెందిన వారు శివుడికి వ్యతిరేకంగా తమ అక్కసు వెళ్లగక్కడం సర్వ సాధారణమైపోయింది. ఈ సమస్యపై తాజాగా నిర్వహించిన ఒక టీవీ చర్చ కార్యక్రమంలో మౌల్వీ ఇలియాస్ షరాఫుద్దీన్ మరోసారి శివలింగాన్ని ప్రైవేట్ పార్ట్‌గా అభివర్ణించాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేకాకుండా పగలబడి నవ్వుతూ తన మతోన్మాద పైత్యాన్ని బటయపెట్టాడు.

జీ న్యూస్ టీవీలో ఈ డిబేట్ నిర్వహించారు. జ్ఞానవాపి వీడియో లీక్ కేసు విషయంపై జరిగిన చర్చలో ఇలియాస్‌తో పాటు ఠాకూర్ దేవకీ నందన్ పాల్గొన్నారు. షరాఫుద్దిన్ మాట్లాడుతూ.. “మీరు ప్రైవేట్ భాగాలను ఎందుకు పూజిస్తున్నారు..? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు..? అంటూ నిలదీశాడు. వేదాలకు-గీతకు వ్యతిరేకంగా, రాముడు కృష్ణునికి వ్యతిరేకంగా, ప్రైవేట్ భాగాలను ఎందుకు పూజిస్తున్నారు? మీకు ప్రైవేట్ పార్ట్స్ ను పూజించాల్సిన అవసరం ఏంటి..? అని దేవకీ నందన్ ను ప్రశ్నిస్తూ.. వికటాట్ట హాసం చేశాడు షరాఫుద్దిన్. అంతేకాదు.. లింగాన్ని, యోనిని ఎందుకు పూజిస్తున్నారు? కోట్లాది మంది హిందువులను నువ్వు ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నావ్… రాముడు, కృష్ణుడి మార్గాన్ని అనుసరించండి.. రావణుడు, కంసుడి మార్గాన్ని విడిచిపెట్టండి అంటూ దేవకీ నందన్ కు సూచించాడు.

ఇలియాస్ షరాఫుద్దిన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ విషయంలో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా యూపీ పోలీసులను డిమాండ్ చేశారు. నుపుర్ శర్మపై చర్యలు తీసుకోవడనికి వెనుకాడని పోలీసులు.. షరాఫుద్దిన్ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. గతంలో కూడా ఇలియాస్ ఒక టీవీ ఛానల్ డిబేట్ లో హిందు దేవీ దేవతలపై విద్వేష వ్యాఖ్యలు చేశాడు షరాఫుద్దిన్. పురుషుల విగ్రహాలను, జననాంగాలను పూజించే అలవాటు “హిందువులకు ఉందని అవహేలన చేశాడు. “విగ్రహాలను పూజించే వారు నరకానికి వెళ్తారని.. హిందూ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి హిందువులు పురుషుల విగ్రహాలను, లింగాలను, జననాంగాలను పూజించకూడదంటూ… పిచ్చి కూతలు కూశాడు. ఆ తర్వాత ఛానెల్ అతన్ని షో నుంచి బయటకు పింపించేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 4 =