More

    ఒకే వేదికపై చూసి చాలామంది రాత్రుళ్లు నిద్రకు దూరమవుతారు: ఏక్ నాథ్ షిండే

    ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వేదిక పంచుకోవడం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు. ఈ సన్నివేశాలు కొంతమందికి నిద్రలేని రాత్రులు మిగిలిస్తూ ఉన్నాయని అన్నారు. శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా షిండే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే..! దీంతో థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం పతనమైంది. అంతకు ముందు శివసేన NCP, కాంగ్రెస్‌తో కలిసి అధికారాన్ని పంచుకుంది. 55 మంది సేన శాసనసభ్యులలో 39 మందితో షిండే తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలికకు దారితీసింది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు కలుసుకున్నారు. థాకరే కూటమిలోని ఎన్సీపీ చీఫ్ పవార్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదికపై కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని ఉద్దేశించి ముఖ్యమంత్రి షిండే ట్వీట్ చేశారు. తనతోపాటు దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్ ను ఒకే వేదికపై చూసి రాష్ట్రంలో చాలామంది రాత్రుళ్లు నిద్రకు దూరమవుతారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం రాత్రి అసోసియేషన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రితో పాటు అసోసియేషన్ బోర్డు మాజీ సభ్యులను ఇతర పెద్దలను ఆహ్వానించింది. షిండేతో పాటు అధికార పక్షానికి చెందిన బీజేపీ నేత ఫడ్నవీస్, ప్రతిపక్ష నేత శరద్ పవార్ సహా పలువురు హాజరయ్యారు.

    Trending Stories

    Related Stories