తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదారబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. డిసెంబర్ 9వ తేదీన సెకండ్ ఫేజ్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే నగరంలోని మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో విస్తరణ కోసం 31 కిలోమీటర్లకు గాను రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.