National

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ అరెస్టు.. అధికారులు ఎలా అదుపులోకి తీసుకున్నారంటే..!

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పెద్ద కొడుకు ఆర్యన్‌ ఖాన్ ఆదివారం నాడు రేప్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికిపోయాడు. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు ఆ నౌకపై రైడ్ చేశారు. ఈ రైడ్ షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్‌ సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ముంబైలోని జేజే మెడికల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ముగ్గురుని మాత్రం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తోపాటు అర్బాజ్ సేత్ మర్చంట్, మున్‌మున్‌ దమేచాను అధికారులు రిమాండ్‌కు తరలించారు. వీరు ముగ్గురూ సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీలో ఉండనున్నారు. నిందితులను విచారించేందుకు రెండు రోజుల కస్టడీని కోరుతూ ఎన్‌సీబీ ప్రత్యేక ప్రాసిక్యూటర్, అడ్వకేట్ అద్వైత్ సేథ్నా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌ తరపున వాదించే న్యాయవాది సతీశ్‌ మనేషిండే కేవలం ఒక్కరోజు మాత్రమే కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. పార్టీ నిర్వాహకులు ఆర్యన్‌ఖాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని కోర్టుకు తెలిపారు. అందుకే ఆయనకు టికెట్‌ గానీ బోర్డింగ్‌ పాస్‌ గానీ లేవని తెలిపారు. ఆర్యన్‌ బ్యాగ్‌లో కూడా అధికారులకు ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని.. ఫోన్‌ చాట్‌లోనూ ఎలాంటి సమాచారం లభించలేదని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ రెండు రోజుల కస్టడీని కోరుతున్నారని కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించాలని కోరారు. కానీ కోర్టు ఇందుకు అంగీకరించలేదు. వారికి రెండు రోజుల కస్టడీని విధించింది.

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శనివారం రాత్రి దాడి చేసింది. ఆ షిప్ లో షారుఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నాయి. ఇక రేవ్‌ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్‌ ఫోన్‌, మరికొందరి ఫోన్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌ ఖాన్‌తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్‌, గోమిత్ చోప్రా ఎన్‌సీబీ అధికారులు విచారించారు. క్రూయిజ్ పార్టీలో చేరడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్రూయిజ్‌ పార్టీ ఆర్గనైజర్లకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీవీ డైరెక్టర్‌ ఖాసిఫ్‌ ఖాన్‌ పర్యవేక్షణలోనే ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గ‌నైజ‌ర్ల‌కు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసింది. రేవ్ పార్టీ త‌ర్వాత సీజ్ చేసిన ఫోన్ల‌కు వ‌చ్చిన మెసేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. క్రూజ్ షిప్‌పై దాడి చేసి అక్క‌డి నుంచి ఎక్స్‌ట‌సీ, కొకైన్‌, మెఫిడ్రోన్‌, చ‌ర‌స్‌లాంటి డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎన్సీబీ వెల్ల‌డించింది. కార్డెలియా అనే ఈ క్రూజ్ షిప్‌పై దాడి చేసిన‌ట్లు ఎన్సీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్రూజ్ ముంబై నుంచి గోవా వెళ్తోంది. త‌మ క్రూజ్‌లో ప్ర‌యాణిస్తున్న వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్‌, సీఈవో జుర్గెన్ బైలోమ్ తెలిపారు. శ‌నివారం రాత్రి బాలీవుడ్‌, ఫ్యాష‌న్‌, బిజినెస్ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌ల‌తో ఈ క్రూజ్ షిప్ మూడు రోజుల ప్ర‌యాణానికి బ‌య‌లు దేరింది.

Related Articles

Back to top button