More

    జైలుకు వచ్చిన షారుఖ్ ఖాన్

    బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మాదక ద్రవ్యాల కేసులో పెట్టుకున్న బెయిలు పిటీషన్ ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం నాడు తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది.ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఆర్య‌న్ ఉన్న త‌న కొడుకుకి బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోన్న షారుఖ్ ఖాన్ జైలుకు వ‌చ్చాడు. ఆర్య‌న్ ఖాన్‌తో మాట్లాడి అత‌డి యోగ‌క్షేమాల గురించి షారుఖ్ తెలుసుకున్నాడు. ఆర్య‌న్ ఖాన్ అరెస్ట‌యిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్ త‌న షూటింగుల‌న్నీ వాయిదా వేసుకున్నాడు.

    ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పటి నుండి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది.

    spot_img

    Trending Stories

    Related Stories