గౌతమ్ గంభీర్ పై మరోసారి నోరు పారేసుకున్న షాహిద్ అఫ్రీది

0
853

షాహిద్ అఫ్రీది.. ఎప్పుడు చూసినా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై నోరు పారేసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడో జరిగిన గొడవను ఇంకా మనసులో పెట్టుకునే చాలా విమర్శలు చేస్తూ వస్తున్నాడు అఫ్రీది. తాజాగా కూడా మరోసారి గంభీర్ పై నోరు పారేసుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ.. గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వాన్ని ఓ టీవీ చర్చా కార్యక్రమం సందర్భంగా తప్పుబట్టాడు. ఇదే కార్యక్రమంలో హర్బజన్ సింగ్ సైతం పాల్గొని పకపకా నవ్వాడు.

ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం చేపట్టింది. నాకు భారత ఆటగాళ్లతో గొడవ ఏమీ లేదు. నిజమే కొన్ని సందర్భాల్లో గౌతమ్ గంభీర్ తో సోషల్ మీడియాలో వాదనలు జరిగాయి. నాకు తెలిసి గౌతమ్ ది ఒక రకమైన వ్యక్తిత్వం. దాన్ని ఎవరూ కూడా, భారత జట్టు సభ్యులు సైతం ఇష్టపడరని అఫ్రిదీ అన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ ఎప్పటికీ భారత్ హీరో అని చెప్పుకొచ్చారు. భారత్ వరల్డ్ కప్ హీరోను అఫ్రీది నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు భారత అభిమానులు.

షాహిద్ అఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య 2007లో కాన్పూర్ లో వన్డే మ్యాచ్ సందర్భంగా గొడవ జరిగింది. గత కొన్నేళ్లుగా అనవసరంగా అఫ్రీది గంభీర్ ని కెలుకుతూనే ఉన్నాడు. గంభీర్ ఘాటుగా రిప్లై ఇస్తూనే ఉన్నాడు.