More

  పడిపోయిన పఠాన్ సినిమా టికెట్ ధర.. మరి ఇంత తక్కువా..?

  ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయంటే దేశ వ్యాప్తంగా భారీ రేట్లు..! మొదటి మూడు నాలుగు రోజులు సినిమాను చూడాలంటే భారీగా వెచ్చించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో ఆశించిన హిట్స్ లేవు. ఒకప్పుడు స్టార్స్ గా ఉన్న హీరోలకు ఇప్పుడు కనీసం కలెక్షన్స్ లేవు. కార్తీక్ ఆర్యన్ లాంటి యంగ్ హీరోలకు మినహాయించి పెద్ద స్టార్స్ కు కూడా థియేట్రికల్ రన్ లో లాభాలు వచ్చిన సినిమాలు పెద్దగా లేవు.

  ఇక ఇప్పుడు బాలీవుడ్ తిరిగి పట్టాలెక్కాలంటే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ సినిమా మీదనే అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నారు. షారుఖ్ ఖాన్ దాదాపు 5 సంవత్సరాల తర్వాత అభిమానులను తన సినిమాతో పలకరించబోతూ ఉన్నాడు. అయితే భారీగా టికెట్ రేట్లు పెడితే జనం థియేటర్లకు రావడం కష్టమని అనుకున్నారో ఏమో చాలా వరకూ టికెట్ రేట్లను తగ్గించి వదిలారు.

  పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. టిక్కెట్ ధరలు భారీగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అయితే రూ.55, రూ.85 టిక్కెట్లు లభిస్తున్నాయని టికెట్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో తక్కువ ధరకే టికెట్లను ఇస్తున్నారు. నివేదికల ప్రకారం, టిక్కెట్ ధరలు కొన్ని ప్రాంతాల్లో రూ. 2100 వరకు ఉండగా.. మరోవైపు, రూ. 55కి కూడా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. పఠాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ టిక్కెట్లు రూ. 55కి అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి 70MM 4K లేజర్ & డాల్బీ అట్మోస్‌ థియేటర్ లో 55 రూపాయల టికెట్స్ కూడా ఉన్నాయి. 100, 150 రూపాయలకే పలు థియేటర్స్ లో టికెట్లు లభిస్తూ ఉన్నాయి.

  ఢిల్లీలోని కరోల్ బాగ్ లిబర్టీ సినిమా 2D నాన్-ఐమాక్స్ వెర్షన్ పఠాన్ టిక్కెట్‌లు రూ. 85కి అందుబాటులో ఉంచింది. ముంబై నగరంలో రూ. 180 కు.. కోల్‌కతాలో రూ. 200 మాత్రమే అమ్ముతున్నారు. బెంగళూరులో మొదటి రోజు మార్నింగ్ షో ఐమాక్స్ టికెట్ ధర కూడా 400 రూపాయలు మాత్రమే ఉంచారు. ఇటీవల విడుదలైన అవతార్, బ్లాక్ పాంథర్ వంటి సినిమాలకు 900 రూపాయల నుండి టికెట్లను అమ్మారు. పఠాన్ సినిమాను మొదటిరోజు ఎక్కువ మంది చూసి.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలని బాలీవుడ్ దర్శక నిర్మాతలు భావిస్తూ ఉన్నారు.

  Trending Stories

  Related Stories