More

    హిందూ ఆలయంలో సీక్రెట్ గా షారుఖ్ ఖాన్ పూజలు..!

    జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. షారుఖ్ ఖాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆలయ సందర్శన చాలా సీక్రెట్ గా జరిగింది. మీడియా కంట పడకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ముఖానికి మాస్క్ ధరించి ఆయన ఆలయానికి వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో షారుఖ్ నడుస్తూ వెళ్తున్న వీడియోలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    భారీ భద్రతతో ఆలయ ప్రాంగణంలోకి షారుఖ్ నడుచుకుంటూ వస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. తన ముఖాన్ని కవర్ చేయడానికి ఫేస్ మాస్క్ ధరించాడు షారుఖ్ ఖాన్. నీలిరంగు జాకెట్‌తో పాటూ తెల్లటి చొక్కా ధరించాడు. భారీ సెక్యురిటీ తో పాటూ.. పోలీసులు కూడా షారుఖ్ ఖాన్ వెనుక నడుస్తూ కనిపించారు. షారుఖ్ ఖాన్ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ‘జవాన్’ విడుదలకు ముందే మరోసారి వైష్ణో దేవీ మాత దీవెనలు అందుకున్నారు.

    ప్రస్తుతం షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రిలీజ్‍ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి సారిగా నయనతార, షారుఖ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. చెన్నై వేదికగా జవాన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍ గా నిర్వహించారు.

    జవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో గ్రాండ్‍గా జవాన్ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ లో షారుఖ్ చెప్పిన ఒక డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. “నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు.. వాడి బాబు మీద చెయ్యి వెయ్యి” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. షారుఖ్ చెప్పిన ఈ డైలాగ్ ఆ మాజీ ప్రభుత్వ అధికారికే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ కేసులో చిక్కుకొని జైలుకి వెళ్లాడు. యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేశాడు. ఆర్యన్ ని సమీర్ వాంఖడేనే కావాలని ఇరికించాడని వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీలోని ఈ డైలాగ్ ని షారుఖ్ ఖాన్ నిజ జీవితానికి లింక్ చేశారు.

    జవాన్‍ ట్రైలర్ లో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి డిఫరెంట్‍గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ రెండు రోల్స్ చేస్తుండగా.. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‍గా చేయగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు, రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలకపాత్రలలో కనిపిస్తున్నారు.

    Related Stories