ఆడపిల్లల హాస్టల్లో హంగామా..! ప్రిన్సిపల్‎ గదికి తాళం..!! కేరళలో SFI గుండాగిరి..!!

0
764

గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర:, గురు: సాక్షాత్ పరబ్రహ్మ, తస్మైసీ గురవేనమ, ఆచార్యదేవో భవ.. ఈ గౌరవ సుభాషితాల గురించి పట్టించుకునే వారు ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయారు. ఏరా.. గురూ.. అనే స్థాయికి దిగజారిపోవడం సైతం ఏనాడో జరిగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వెర్రితలలు ఎంత వరకు వచ్చాయంటే.. సాక్షాత్తు విద్యాలయాల ప్రధాన గురుదేవులపై దాడి చేసే స్థాయికి వచ్చేసింది. హత్యాయత్నానికి తలపడే స్థితికి చేరుకుంది. కొన్నిచోట్ల దారుణంగా గురు హత్యలు సైతం చేసేస్తున్నారు. సహచర విద్యార్థిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేయడం, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని హుకుం జారీచయడం.. అంటే…ఇక విద్యావ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. విద్యార్థి సంఘ నేతల బుద్ధి, జ్ఞానాలు ఎంత గొప్పగా వున్నాయో గ్రహించవచ్చు.

ఇంతకు, ఆ పాఠశాల హెడ్ మాస్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్స్ చేసే ఘోర తప్పిదం ఏంటంటే.. విద్యార్థులు తప్పుచేస్తే మందలించడం, సక్రమ ప్రవర్త కలిగివుండాలని, మంచి, మర్యాదలు కలిగివుండాలని బోధించడం. ఆడపిల్లల హస్టల్స్ లోకి అక్రమంగా ప్రవేశించి, సస్పెండైన సహచర విద్యార్థులపై.. సస్పెన్షన్ ఎత్తివేయాలని గూండా విద్యార్థినేతలు ప్రిన్సిపాల్ పై వాదనలకు దిగి, బెదిరింపులకు పాల్పడితే.. ఆ ప్రధాన గురువు, తన గోడు ఎవరికి తెలియజేయాలి. ఎవరు ఈ అవస్థల వ్యవస్థకు చికిత్స చేస్తారు. నేరాలకు కేరాఫ్ గా వున్న కేరళలో.. వారం రోజుల్లో రెండోసార్లు ప్రిన్సిపాల్స్ పై SFI గూండాలు బెదిరింపులకు, దాడులకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

కేరళలో మహిళా హాస్టల్ వార్డెన్‌ను బెదిరించి, మహిళా హాస్టల్‌లోకి ఇద్దరు విద్యార్థులు అక్రమంగా ప్రవేశించారు. జిష్ణు, రంజిత్‌ అనే విద్యార్థులు గూండాల మాదిరి వ్యవహరించి ఈ అనుచిత చర్యకు పాల్పడ్డారు. దీంతో, కళాశాల యాజమాన్యం నిందిత విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, నిందిత విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్నిSFI నేతలు తప్పుపట్టారు.

కేరళ ఇడుక్కి జిల్లా కట్టప్పన ప్రభుత్వ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ కు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినులను కళాశాల ఉపాధ్యాయురాలిగా వున్న హాస్టల్ వార్డెన్ మందలించారు. హాస్టల్ నియామలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించడం తగదని వార్డెన్-కమ్-ఉపాధ్యాయురాలు అన్నారు. ఈ ఘటనను సాకుగా చూపి.. ఎస్‌ఎఫ్‌ఐ గూండాలు జిష్ణు, రంజిత్ అనే విద్యార్థులు అక్రమంగా మహిళా హాస్టల్ లోకి ప్రవేశించారు. ఆడపిల్లలకు ఏదో న్యాయం చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి.. వార్డెన్ ను దూషించి నానా హంగామా చేసారు. హాస్టల్ లోకి యువకులు ప్రవేశించి.. అలజడి సృష్టించడంతో ఆడపిల్లలు భయాందోళనకు గురయ్యారు. వార్డెన్ ను బెదిరించి మహిళా హాస్టల్ లోకి ప్రవేశించిన జిష్ణు, రంజిత్‌లపై కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. క్రమశిక్షణా చర్యలకు ప్రతీకారం అంటూ.. SFI నేతలు ప్రిన్సిపాల్ కన్నన్ ను ఆయన కార్యాలయంలో ఆరు గంటలపాటు బంధించారు. అక్రమ నిర్బంధానికి గురి చేయడమే కాకుండా..ఆయనకు ఏ విధమైన ఆహారం అందించకుండా హింసకు గురిచేశారు.

వారం రోజులకు ముందు లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వ్యక్తులు ఈ తరహాలోనే బెదరింపులకు పాల్పడ్డారు. ప్రిన్సిపాల్ రూంలో పోలీసు అధికారులు, ఇతర అధికారులు వున్న సమయంలోనే, నిర్భయంగా, నిర్లజ్జగా ప్రిన్సిపాల్ పై ఎస్‌ఎఫ్‌ఐ నేతలు బెదిరింపులకు దిగారు. ఈ ఘటన కేరళ త్రిసూర్ జిల్లా మహారాజాస్ టెక్నలాజికల్ ఇన్ స్టిట్యూట్‌లో జరిగింది. హసన్ ముబారక్ ఆధ్వర్యంలో ఐదుగురు SFI నేతలు, తాత్కాలిక ప్రిన్సిపాల్ డాక్టర్ దిలీప్‌పై నాడు బెదిరింపులకు దిగారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × 2 =