International

అమ్మాయిలతో అసభ్యకరమైన యాడ్..!
అడ్మిషన్ల కోసం దిగజారిన చైనా యూనిర్సిటీ

సాధారణంగా ర్యాంకులు, అకడమిక్ మెరిట్స్, సౌకర్యాలు చూపించి విశ్వవిద్యాలయాలు పబ్లిసిటీ చేసుకుంటాయి. కానీ, చైనాలోని ఓ యూనివర్సిటీ మాత్రం.. అడ్మిషన్లు పెంచుకునేందుకు ఓ పనిమాలిన చర్యకు పాల్పడింది. చైనాలోని అగ్రశ్రేణి విశ్వవవిద్యాలయాల్లో ఒకటైన.. నంజియాంగ్ యూనివర్సిటీ విద్యావ్యవస్థకే మచ్చతెచ్చే పనిచేసింది. వచ్చే విద్యా సంవత్సరం కోసం అప్లికేషన్లను ఆహ్వానించడానికి.. నంజియాంగ్ యూనివర్సిటీ స్థానిక వెబో ప్లాట్ ఫామ్ లో ఓ అడ్వర్టయిజ్ మెంట్ వివాదాస్పందగా మారింది. ఆ యాడ్ చూసిన నెటిజన్లు యూనివర్సిటీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ ప్రకటన విద్యార్థుల్లో లైంగికపరమైన ఆకర్షణను పెంచేవిధంగా వుండటమే ఇందుకు కారణం.

అడ్మిషన్లు పెంచుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం అసభ్యకరమైన యాడ్ పోస్ట్ చేసింది. యాడ్ లో ప్రస్తుత విద్యార్థినులు క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల ముందు ప్లకార్డులను పట్టుకున్న ఆరు ఫోటోలు ఉన్నాయి. వీటిలో ఇద్దరు యువతుల చేతుల్లోని ప్లకార్డుల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. వీటిలో రెండు ఫోటోలు విమర్శలకు కేంద్రంగా మారాయి. ఒక అందమైన యువతి పట్టుకొని ఉన్న ప్లకార్డుపై.. ‘మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో కంపెనీ కావాలనుకుంటున్నారా..? అయితే, మా యూనివర్సిటీలో చేరండి’ అని రాసి ఉంది. ఇక మరో యువతి పట్టుకున్న ప్లకార్డుపై.. ‘మీ యవ్వనంలో నా భాగస్వామ్యం కావాలనుకుంటే, మా యూనివర్సిటీలో చేరండి’ అని రాసి ఉంది. మిగతా ఫోటోల్లో కొందరు యువకులు ప్లకార్డులను పట్టుకున్నట్లు చూపించినా.. మరీ, ఇంత బరితెగించిన వ్యాఖ్యలు లేవు.

చైనాలో ప్రతి సంవత్సరం యూనివర్సిటీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను చైనాలో ‘గాయోకావో’ అని పిలుస్తారు. ఆ ఎంట్రెన్స్ టెస్టు తొలిరోజే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో ప్రవేశ పరీక్ష సందర్భంగా విద్యార్థులను ఆకర్షించడానికి నాన్జింగ్ యూనివర్సిటీ వీబోలో ఇలాంటి అసభ్యకరమైన యాడ్‌ను పోస్ట్ చేసింది. ఈ యాడ్ పై విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థలు.. అడ్మిషన్ల కోసం మరీ ఇంత దిగజారడమేంటని మండిపడుతున్నారు. ఈ ప్రకటన మహిళలను చులకన చేసేలా ఉందని కొన్ని ఎన్జీవోలు సైతం విమర్శిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఇది వైరల్ కావడంతో పాటు వివాదాస్పదమైంది. దీంతో యాడ్‌లో చూపించిన ఫోటోలను సదరు యూనివర్సీటీ తొలగించింది.

చైనాలోని అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీల్లో NJU ఒకటి. క్వాక్వరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2021లో.. ఈ సంస్థ ప్రపంచంలో 124వ స్థానం దక్కించుకుంది. తాజా వివాదం నేపథ్యంలో.. పేరు, ప్రఖ్యాతలు ఉన్న ఈ సంస్థ చెత్త అడ్వటైజ్‌మెంట్లు ఇవ్వడం సరికాదని చైనా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అందమైన యువతీ, యువకులను ఎరగా వేసి ఎన్‌జేయూ యూనివర్సిటీ అడ్మిషన్లు పొందాలనుకుంటుందని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం విబోలో ఒక వ్యక్తి కామెంట్ రాశాడు. ఇలా కాకుండా యూనివర్సిటీలో ఉన్న వనరులు, నాణ్యమైన విద్యను ఆన్‌లైన్ యాడ్‌లో ఆదర్శంగా చూపిస్తే బాగుండేదని మరొకరు రాశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

one × 4 =

Back to top button