More

    పాకిస్థాన్ లో ట్రెండ్ అవుతున్న మన ‘మేజర్’ మూవీ

    యువ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించాడు. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్‌ లో పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

    అయితే ఈ సినిమాను పాకిస్థాన్ లో కూడా బాగా చూస్తున్నారట..! నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో, మేజర్ హిందీ వెర్షన్ ప్రస్తుతం ట్రెండ్‌ల జాబితాలో ఒకటిగా ఉండగా, తెలుగు వెర్షన్ 2వ స్థానంలో ఉంది. మేజర్ చిత్రం పాకిస్థాన్ లో కూడా మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లో కూడా సినిమా నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

    సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలలో కనిపించారు. సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. జూన్ 3వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. మేజర్ సినిమా భారతదేశంలోని ముంబైలో 2008 తాజ్ ప్యాలెస్ హోటల్ దాడి సమయంలో విధి నిర్వహణలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కెరీర్ గురించి చూపించింది.

    spot_img

    Trending Stories

    Related Stories