గుండమ్మ కథ, గుప్పెడంత మనసు వంటి సీరియళ్లలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నాగవర్ధిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసులో అదుపులోకి తీుసుకున్నారు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న నాగవర్ధిని(34) సూర్యనారాయణ(30) లు ప్రేమించుకున్నారు. కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నాలుగేళ్లు సహజీవనం చేశారు. అయితే.. ఇటీవల అతడికి దూరమైన నాగవర్థిని నాలుగు నెలలుగా శ్రీనివాస్‌రెడ్డి అనే మరో వ్యక్తితో అదే ప్లాట్‌లో సహజీవనం చేస్తోంది. సూర్య నారాయణ అదే భవనంలోని నాలుగో అంతస్తులో ఉంటున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మాజీ ప్రియుడు తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. సూర్యనారాయణను అక్టోబర్ 30న రాత్రి ఇద్దరు కలిసి రెండో ఫ్లోర్ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నాగవర్ధిని, శ్రీనివాస్ రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితుడి మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.