More

    NDTVని వీడుతున్న సీనియర్ దిగ్గజాలు..!

    ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ NDTV ప్రమోటర్ కంపెనీ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవి నుండి వైదొలిగిన ఒక రోజు తర్వాత, NDTV ఇండియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ కూడా విధుల నుండి వైదొలిగారు. బుధవారం నాడు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని ఛానెల్ కూడా పేర్కొంది. రవీష్ కొంతమంది జర్నలిస్టులను, ప్రజలను ప్రభావితం చేశారని.. ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయని ఛానల్ తెలిపింది. ఓ గొప్ప గుర్తింపు కలిగిన వ్యక్తి అని ఛానెల్ తెలిపింది. రవీష్ దశాబ్దాలుగా NDTVలో అంతర్భాగంగా ఉన్నారు. ఆయన సహకారం అపారమైనదని.. ఎన్డీటీవీ తెలిపింది. ఛానెల్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ రాజీనామా చేసినట్టు ఎన్డీటీవీ ఇంటర్నెల్ మెయిల్ లో తెలిపింది. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రైమ్‌టైమ్, దేశ్ కీ బాత్, హమ్‌లాగ్, రవీశ్ కీ రిపోర్ట్ వంటి కార్యక్రమాలతో ప్రాచుర్యం పొందిన జర్నలిస్ట్ రవీష్ కుమార్ రాజీనామా తక్షణం అమల్లో వస్తుందని కూడా ఛానెల్ ఇంటర్నల్ మెయిల్ తెలిపింది.

    ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్‌పీఆర్‌కు ఆ సంస్థ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు రాజీనామా చేసిన వెంటనే ఆ స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సినియాలను ఆర్ఆర్‌పీఆర్ బోర్డు కొత్త డైరెక్టర్లుగా నియమించింది.

    Trending Stories

    Related Stories