More

    రాజీనామాకు సిద్ధమే: ఉద్ధవ్ థాక్రే

    రాష్ట్రంలో రాజకీయ గందరగోళం మధ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం గౌహతిలో ఉన్న ఏకాంత్ షిండే తిరుగుబాటు గ్రూపులో చేరేందుకు మరో నలుగురు శివసేన ఎమ్మెల్యేలు వెళ్తున్నారని తెలుస్తోంది. వారు చేరిన తర్వాత, షిండేతో ఉన్న సేన ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరుకుంటుంది, అదే జరిగితే ఫిరాయింపుల నిరోధక చట్టం వారి గ్రూప్‌పై వర్తించదు.

    తిరుగుబాటు సంక్షోభం చెలరేగినప్పటి నుండి తన మొదటి ప్రసంగం ఇచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. తాను “కుర్చీ కోసం పోరాడబోనని తన పార్టీ శివసేన హిందుత్వాన్ని ఎప్పటికీ వదులుకోదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా ఒక్క ఎమ్మెల్యే అయినా నాపై అభ్యంతరం వ్యక్తం చేస్తే నేను రాజీనామా చేస్తానన్నారు. నా రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుతున్నాను. నన్ను రాజీనామా చేయమని మీరు నాకు చెప్పండని ఉద్ధవ్ థాక్రే అన్నారు. తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండేను తమ నాయకుడిగా సమర్థిస్తూ 30 మంది శివసేన ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాసిన కొద్దిసేపటికే ఉద్ధవ్ మాట్లాడారు.

    “ఏక్‌నాథ్ షిండేతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యేల నుండి నాకు కాల్స్ వస్తున్నాయి; తమను బలవంతంగా తీసుకెళ్లినట్లు వారు వాదిస్తున్నారు” అని ఉద్ధవ్ అన్నారు. “నాకు పరిపాలనా అనుభవం లేదు.. మా నాన్నకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నేను 25 ఏళ్లుగా పోరాడిన కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలపాల్సి వచ్చింది” అని ఉద్ధవ్ చెప్పారు. “ఎన్‌సిపి, కాంగ్రెస్ నన్ను వద్దు అని చెబితే అది ఆమోదయోగ్యమైనది. కానీ, నా స్వంత వాళ్లే నన్ను వద్దనుకుంటే ఏమి చేయగలను?” అని ఉద్ధవ్ అన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories