ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు షాక్ ఇచ్చాడు వరుణుడు. తొలి రోజు వర్షం పడుతూనే ఉండడంతో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్.. ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాంప్టన్ లో వర్షం కురుస్తుండడంతో మొదటి రోజు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంచనా వేసినా వర్షం మొదలవ్వడంతో నిరాశ తప్పలేదు. తొలి రోజు ఆట రద్దయినప్పటికీ ఈ టెస్టు మ్యాచ్ 5 రోజుల పాటు సాగనుంది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేను కేటాయించారు. అయితే రాబోయే రోజుల్లో కూడా వర్షం ముప్పు పొంచి ఉందట..!

మొదటి రోజు భారీ వర్షం తరువాత.. రెండో రోజు మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సౌతాంప్టన్‌లో 2 వ రోజు వాతావరణ సూచనల్లో మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రవారం పూర్తిగా నగరంలో వర్షం కురిసిన తరువాత, శనివారం కాస్త ఎండ కనిపించనుంది. డే 1 ఆట కోల్పోయిన కారణంగా మిగిలిన నాలుగు రోజులలో అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత వాతావరణ సూచనల ప్రకరాం ఉదయం సెషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టాస్ కు వెళ్ళే అవకాశం ఉంది. శనివారం నాడు మధ్యాహ్నం సెషన్‌లో 30 శాతం వర్షాలువర్షం పడే అవకాశం ఉంది.. సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది.
