Telugu States

అదిగో పులి.. ఎక్కడి నుండి వచ్చిందంటే..!

కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అట‌వీ, వన్యప్రాణి ర‌క్ష‌ణ‌, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు మండలాల్లోని 33 గ్రామాల్లో పులి తిరిగింది. నెల రోజుల పాటు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అది తిరుగుతోంది. పులి దిశ ఆ కారిడార్ మీదుగా ఇలాగే ఉంటే సార్లంక అభయారణ్యం మీదుగా అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెస్క్యూ టీం సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి నెల రోజులుగా పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ పులి ఒరిస్సా నుంచి నాగుల కొండ మీదుగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. నిర్దిష్టమైన ప్రదేశంలో ఉందని అంచనాకి వస్తే పులిని ట్రాంక్విలైజ్ గ‌న్‌తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలా చేయాలన్నది అధికారుల ప్లాన్. ఇదే విషయాన్ని మహారాష్ట్ర తడోబా నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

Related Articles

Back to top button