More

    జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

    జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు వారణాసి కోర్టులో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూడాలని తెలిపింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.

    వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించింది. మిశ్రా అసిస్టెంట్ సర్వే వివరాలను మీడియాకు తెలియజేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ అనే ఇద్దరు అధికారులు కోర్ట్ కమిషనర్, డిప్యూటీ కోర్ట్ కమిషనర్ గా కొనసాగుతారు. గుడిని పడగొట్టి మసీదు నిర్మించారనే ఆరోపణలు రావడంతో వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది.

    Trending Stories

    Related Stories