National

టెన్త్ క్లాస్ అమ్మాయి.. ఇంట్లో ఉన్న 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించి ఏమి చేసిందంటే

పదవ తరగతి చదువుతున్న అమ్మాయి.. తన ఇంట్లో బంగారం ఉన్న విషయం తెలుసుకుంది. మొత్తం 750 గ్రాముల బంగారం.. తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకుని వచ్చింది. అయితే ఆ బంగారాన్ని ఆమె ఏమి చేసిందంటే..? సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్లకు ఇచ్చేసింది..! విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న షిబిన్ అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్‌ను సదరు అమ్మాయి చూసింది. 15 ఏళ్ల అమ్మాయి షిబిన్ తో ఇదే విషయం మాట్లాడింది. పలు విషయాలను షేర్ చేసుకుంటూ.. చివరికి ఇద్దరూ స్నేహితులు అయ్యారు. షిబిన్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అమ్మాయి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే ఆ అమ్మాయి తన తల్లికి చెందిన 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించి, దానిని ఒక పెట్టెలో ఉంచి షిబిన్‌కు అప్పగించింది. షిబిన్ తన తల్లితో సహా వచ్చి బంగారాన్ని తీసుకున్నాడు. ఆ బంగారాన్ని షిబిన్ తన తల్లితో కలిసి నగదు కోసం విక్రయించాడు. బంగారాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించుకుని.. షిబిన్ తల్లి ఇంటి రెనోవేషన్ చేయించింది. మిగిలిన రూ. 10 లక్షలు తన వద్ద ఉంచుకుంది.

కొద్ది నెలల తర్వాత బంగారం కనిపించడం లేదని గుర్తించిన బాలిక తల్లి అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిని విచారిస్తే బంగారాన్ని షిబిన్ కు ఇచ్చినట్లు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా షిబిన్, అతని తల్లి షాజీని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. షిబిన్ ఇంటి నుంచి దాదాపు రూ .10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏడాది క్రితం తన ఆన్‌లైన్ స్నేహితుడికి బంగారాన్ని ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. విచారణ సమయంలో, షిబిన్ ఆ అమ్మాయి తనకు కేవలం 270 గ్రాముల బంగారం ఇచ్చినట్లు తెలిపింది. పాలక్కాడ్‌కు చెందిన మరో ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడికి 40 గ్రాముల బంగారం ఇచ్చినట్లు ఆ అమ్మాయి తర్వాత వెల్లడించింది. బంగారం అందుకున్న తర్వాత 40 గ్రాములు తీసుకున్న స్నేహితుడు ఆమెను బ్లాక్ చేసినట్లు తెలిసింది. ఇంకా ఎవరెవరికి ఆ బాలిక బంగారాన్ని ఇచ్చిందోనని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × 5 =

Back to top button