బెంగళూరులో నడిరోడ్డుపై సిగపట్లు పట్టిన స్కూల్ గర్ల్స్

0
724

ఇప్పటిదాకా కాలేజ్ కుర్రాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే చూశాం.. తాజాగా బెంగళూరులో స్కూల్ గాళ్స్ కొట్టుకున్నారు.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బెంగళూరు నగరం నడి బొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొట్టడానికి కర్రను పట్టుకుని ఉండడం కూడా చూడవచ్చు. మెట్ల వద్ద కూడా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చేశారు. సెయింట్ మార్క్స్ రోడ్డులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి.. మొదట గొడవను ఆపడానికి అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించినా కూడా వీలు పడలేదు. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరితో ఒకరు కొట్టుకున్నారు. కొందరు పాఠశాల యూనిఫారం ధరించి ఉండగా, ఇంకొందరు సాధారణ దుస్తులు ధరించారు. బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నదాన్ని బట్టి.. ఈ గొడవలో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి బెంగళూరులోని ప్రసిద్ధ బిషప్ కాటన్ బాలికల పాఠశాల అని తెలిపారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం తెలిసిరాలేదు. గొడవకు సంబంధించిన కారణం కూడా తెలియరాలేదు. ఘటనా స్థలంలో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు.