More

    మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

    తెలంగాణలో మరో రాజకీయ సమరానికి రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు.

    నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనుంది. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకున్నాయి.

    Trending Stories

    Related Stories