సుప్రీం కోర్టు తీర్పుతో.. దీదీకి జైశ్రీరాం బెంగ

0
745

జై శ్రీరామ్.. ఈ పేరు పలికితే చాలు హిందువులకు హనుమంతిడికి ఉన్నంత శక్తి వస్తుంది. ఆ నినాదం చేస్తే చాలు ఆత్మగౌరవం చెక్కు చెదరకుండా నిలబడుతుంది. రాజకీయాలతో మాకు సంబంధం లేదు.. మతాలతో మాకు విభేదం లేదు. ఆ నామం ఎవరు పలికినా వారికి మా మద్దతు ఉంటుంది అనేది కోట్లాది హిందువుల మాట. భాష, ప్రాంతం, మతం, ఆచారాల పరంగా ఈ దేశం విడిగా ఉన్న వారందరినీ ఒకే తాటిన కలిపై ఐక్యతా రాగం శ్రీరాముడి నామం… జై శ్రీరాం ఇది మత నినాదం కానే కాదు.. ఈ దేశ ఆత్మగౌరవ నినాదం.

ఇప్పుడు ఈ విషయాలన్ని స్పృశించడానికి గల సందర్భం ఏమిటి అన్నది ఇప్పడు చూద్దాం.

సుప్రీంకోర్టు ఇవాళ రెండు కీలకమైన పిటిషన్‌ లను కొట్టివేసింది. అందులో పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం.. 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ఒకటి కాగా.. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు… ఎన్నికల ప్రచారంలో జైశ్రీరామ్ అనకుండా, అలాంటి నినాదాలు ఇవ్వకుండా… ఆదేశం ఇవ్వమని రెండవ పిటిషన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్‌ తో కూడిన ధర్మాసనం… ఈ రెండు పిటిషన్ లను కొట్టివేసింది.

ఈ పిటిషన్ వేసింది అడ్వకేట్ ఎంఎల్ శర్మ. ముందుగా దీనిపై కలకత్తా హైకోర్టుకు వెళ్లమని బెంచ్ తెలిపింది. “ఇది ఎన్నికల పిటిషన్ కాదు. ఓ పార్టీ మతపరమైన నినాదాలు చేస్తోంది. నేను హైకోర్టుకు ఎందుకు వెళ్లాలి” అని శర్మ రివర్సులో బెంచ్‌ని ప్రశ్నించారు. కావాలంటే ఈ పిటిషన్‌పై విచారణను బుధవారం చేపట్టండి అని పిటిషనర్ కోరారు. దాంతో ధర్మాసనం “సరే… మేము మీతో ఏకీభవించట్లేదు. కొట్టివేస్తున్నాం” అని పిటిషన్‌ను కొట్టేశారు. తద్వారా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో… ఎవరైనా సరే… జై శ్రీరామ్ నినాదాలు చేయవచ్చు. అది చట్టపరంగా నేరం కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా తేల్చినట్లైంది.

ఇక మరో పిటిషన్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడమంటే… రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అంటే సమానత్వ హక్కుకు, ఆర్టికల్ 21 జీవించే హక్కుకు వ్యతిరేకం అని పిటిషనర్ వాదించారు. దానికి కౌంటర్ గా అంతొద్దు ఇది చాలు అంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కూడా కొట్టేసింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ… 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం కరెక్టు కాదనీ… కేంద్ర ఎన్నికల సంఘం… బీజేపీ అదుపాజ్ఞల్లో పనిచేస్తోందని చేసిన ఆరోపణలు చెల్లవని సుప్రీంకోర్టు పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది.

ఇక మరో అసలు విషయం.. ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా జై శ్రీరామ్ నినాదాన్ని వినిపిస్తూ ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ఈ శ్రీరామ నినాదం వింటే చాలు దీదీకి ఎక్కడలేని బీపీ వచ్చేస్తోంది. గతంలో కూడా జై శ్రీరాం అని నినదించినందుకు తన వాహనాన్ని ఆపి మరి ఒక యువకున్ని బెదిరించి, అదిరించిన వీడియో వైరల్ అవ్వడం చూసాం. శ్రీరాముణ్ని బీజేపీ అస్త్రంలా ఫీలవుతున్న దీదీ… ఎక్కడా శ్రీరామ నినాదం వినిపించకుండా జాగ్రత్త పడుతున్న చర్యల్లో ఈ పిటిషన్ ఒకటని వినికిడి. అది ఇప్పడు సుప్రీంకోర్టు సాక్షిగా తుస్సుమనడంతో ఉస్సూరుమంటున్నారు. మరోవైపు శ్రీరామ నామం కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. వీలైనంత ఎక్కువగా శ్రీరామ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ తన ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకువెళుతోంది.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. జై శీరామ్ నినాదం, లేద దేశ భక్తి భావన బీజేపీకి ఏమన్నా పేటెంట్ హక్కులతో కూడుకున్న వ్యవహారమా..? సరే జై శ్రీరాం నినాదాన్ని బీజేపీ వాడుకుంటుంది.. హిందువులను మభ్యపెడుతుంది అని భావిస్తున్న పార్టీలు.. బీజేపీ వలె ఎందుకు బహిరంగ సభల్లో అదే నినాదం ఎత్తుకోవట్లేదు. జై శ్రీరాం అన్ని పార్టీలు బలంగా వాడుకోవచ్చు కదా.. ఎందుకు బీజేపీయే జై శ్రీరాం అనాలి.. కాంగ్రెస్ అనరాదా.. తృణమూల్ కాంగ్రెస్ అనరాదా..? లేక అననీకి మనసు రావట్లేదా.. ఒకవేళ మనసు పలికినా మాట పెగలడం లేదా.. దానికి కారణం మైనార్టీ ఓట్లను కొల్లగొట్టాలనే ఎజెండా కాదా..? ఇలా సంధించుకుంటూ పోతే వందల ప్రశ్నలు హిందువుల మదిలో ఉన్నాయంటున్నారు జాతీయవాదులు..

మరి మీరేం అంటారన్నది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 + 13 =