30 ఏళ్ల కేసు..! సిద్దూకు ఏడాది జైలు శిక్ష

0
844

పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూకి షాకిచ్చింది సుప్రీంకోర్టు. ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది.

1988లో జ‌రిగిన రోడ్ రేజ్ కేసులో భాగంగా ఈ శిక్ష వేసింది సుప్రీంకోర్టు. అప్పట్లో గుర్నామ్ సింగ్ అనే వ్య‌క్తి తో సిద్దూ గొడవ పడ్డారు. మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. పట్టరాని కోపంతో గుర్నామ్‌ ను కొట్టడంతో అతను చనిపోయాడు. బాధిత కుటుంబం సిద్దూపై కేసు పెట్టింది. ఈ కేసులో కింది కోర్టు సిద్దూకి బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ పాటియాలాలోని సెషన్స్ కోర్టు 1999 సెప్టెంబర్ 22న సిద్ధూని నిర్దోషిగా ప్రకటించింది. బాధిత ఫ్యామిలీ మాత్రం పట్టువిడవకుండా హైకోర్టులో సవాల్ చేసింది. కేసును విచారించిన ధర్మాసనం 2006లో సిద్ధూని దోషిగా ప్రకటిస్తూ మూడేళ్ల జైలు శిక్షను విధించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సిద్దూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన్ను దోషిగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే.. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

six + 13 =