More

    విజయ్ మాల్యాకు శిక్షను ఖరారు చేసిన సుప్రీం కోర్టు

    విజయ్‌ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది.. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

    జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది.

    spot_img

    Trending Stories

    Related Stories