దళిత రిజర్వేషన్ పోరాట వీరుడు.. కర్నె శ్రీశైలం ఇకలేరు

0
720

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్నె శ్రీశైలం కన్నుమూశారు. కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హోలీ రోజున స్కూటర్ యాక్సిడెంట్ గురై ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ ఈ రోజు (శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. జాతీయవాద భావాలున్న కర్నె శ్రీశైలం నిత్యం హిందూ సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా ఎస్సీల రిజర్వేన్ల విషయంలో జరుగుతున్న మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవారు. మతం మార్చుకుని ఎస్సీలుగా చెలామణి అవుతున్న వారిపట్ల వ్యతిరేక గళం వినిపించేవారు. మతం మారిన దళితులకు రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండేందుకు పోరాటాలు చేశారు. అంబేద్కరిస్టుల పేరుతో కొందరు దళితుల మధ్య విభేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని దళితులను ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, కత్తి మహేష్ వంటి వారిపై పదునైన వ్యాఖ్యలు చేసేవారు. ఈ విషయంలో ఆయనపై దాడులు కూడా జరిగాయి. దళితులు జాంభవంతుడి వారసులని.. దళితులంటే మూలవాసులని.. వారే నిజమైన హిందువులని .. అలాంటి వారు మతం మర్చుకోవడం ఏంటని ప్రశ్నించేవారు. మూలవాసి సిద్ధాంతాన్ని బలంగా వినిపించేవారు. నిజమైన దళిలతుకే రిజర్వేషన్లు అమలు అయ్యేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. కర్నె శ్రీశైలం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. జాతీయవాదులంతా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతి దళితులతోపాటు.. జాతీయవాదులకు తీరని లోటన్నారు. వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. మనసా వాచా కర్మణ దేశం కోసం దర్మం కోసం పనిచేస్తున్న జాతీయ వాద సంస్థ నేషనలిస్ట్ హబ్.. కర్నె శ్రీశైలం మృతి పట్ల నివాళి అర్పిస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here