National

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక విజ్ఞప్తి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక విజ్ఞప్తి. ఆదివారం నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలలో అవాంతరాలు ఎదురుకానున్నాయి. మెయింటెనెన్స్ కారణంగా స్టేట్ బ్యాంక్ ఇండియా జూలై 4 న తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కొద్ది సమయం పాటూ అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యుపిఐ నిలిపివేయబడనున్నాయి. 04.07.2021 అంటే ఆదివారం ఉదయం 03.25 గంటలు మరియు 05.50 గంటల మధ్య మెయింటెనెన్స్ ను చేపట్టబోతున్నామని ఎస్.బి.ఐ. అధికారికంగా తెలిపింది. ఈ కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యోనో / యోనో లైట్ / యుపిఐ అందుబాటులో ఉండదని తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని సంస్థ వినియోగదారులకు తెలిపింది.

బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు 2021 జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. జూలై 1 నుండి వినియోగదారులకు బ్యాంకు యొక్క ఎటిఎంలు మరియు శాఖల నుండి నాలుగు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణకు అర్హత ఉంటుందని తెలిపింది. నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ చెక్ బుక్ ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. ఇక 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు.

మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విరాళాన్ని ప్రకటించింది. 2.50 లక్షల మంది ఉద్యోగులు ఎస్‌బీఐ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. “మా ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో కూడా మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గర్వకారణం. వారు సేవలు అందించడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారు. అదనంగా, మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సమయంలో వారు స్వచ్ఛందంగా ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు” అని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు సహకారం అందించడం ఇది రెండవసారి. గత సంవత్సరంలో ఎస్‌బీఐ తన వార్షిక లాభంలో 0.25% కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా అవసరమైన వారికి మాస్క్ లు, శానిటీసర్ల సరఫరా రూపంలో విరాళాలు కూడా ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight + twenty =

Back to top button