చైనా వ్యాక్సిన్ ఘనకీర్తి ప్రపంచం మొత్తానికి అర్థమవుతోంది. కరోనా వైరస్ ను ఎంతో స్ట్రాంగ్ గా తయారుచేసి ప్రపంచం మీదికి వదిలిన చైనా.. వ్యాక్సిన్ ను మాత్రం తనకు అలవాటైన రీతిలో నాసిరకంగా తయారుచేసింది. దీంతో చైనా వ్యాక్సిన్ బలుపు కాదు, వాపు అన్న విషయాన్ని మెజారిటీ దేశాలు ముందే పసిగట్టాయి. డ్రాగన్ వ్యాక్సిన్ ను పక్కనపెట్టేశాయి. కానీ, డ్రాగన్ మిత్రదేశం, టెర్రరిస్టు టెంట్ హౌజ్ పాకిస్తాన్ మాత్రం డాబులకు పోయింది. చైనా టీకాయే ముద్దు, వేరే టీకా వద్దు అంటూ.. ఇమ్రాన్ సర్కార్ అక్కడి ప్రజలకు నాసిరకం వ్యాక్సిన్లు గుచ్చేసింది. ఇప్పుడు దాని పర్యవసానం తెలుసుకుని లబోదిమోమంటోంది.
విషయానికి వస్తే.. చైనా టీకా ప్రభావం తేలిపోవడంతో ఆ వ్యాక్సిన్లు వేసుకున్నవారిని ఇతర దేశాలు నమ్మడం లేదు. తాజా సంఘటనే ఇందుకు ఉదాహరణ. చైనా వ్యాక్సిన్లు వాడిన పాకిస్తాన్ పౌరులకు.. సౌదీ అరేబియా వీసాలు ఇవ్వడం లేదు. ఇమ్రాన్ ఖాన్ సౌదీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కొద్దిరోజులకే సౌదీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇప్పటికే వీసా ఉన్నవాళ్లు సౌదీలో అడుగుపెట్టినా.. 14 రోజులు క్వారంటైన్ లో పెట్టి ఆ తర్వాత దేశంలోకి అనుమతిస్తోంది. అదీకాకుండా పుండుమీద కారం చల్లినట్టు.. క్వారంటైన్ ఖర్చులను కూడా పాకిస్తానీయులే భరించాలని షరతులు పెట్టింది. దీంతో సౌదీ వెళ్లాలనుకునే పాకిస్తాన్ పౌరులు.. తమ ఒంట్లోకి చైనా వ్యాక్సిన్లను ఎక్కించిన ఇమ్రాన్ పై మండిపడుతున్నారట. ఇప్పటికే పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా వ్యాక్సిన్ తప్ప మరోటి వాడటం లేదు. దీంతో చైనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలంతా ఆందోళన చెందుతున్నారట. వీసా దొరక్కపోతే పోయింది.. అసలు ప్రభావం చూపని టీకాతో కరోనా నుంచి తమకు రక్షణ ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఎప్పుడైతే టర్కీ తురుంఖాన్ ఎర్డోగాన్ ను వెనకేసుకుని.. సౌదీని మీద అవాకులు చెవాకులు పేలాడో.. మన ఇమ్రాన్ ఖాన్ సాబ్ కు డౌన్ టర్న్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఇరు దేశాల మధ్యనున్న దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ బిల్లిబిత్తిరి చేష్టలతో ఒళ్లుమండిన సౌదీ అరేబియా.. తీసుకున్న అప్పు కక్కాలంటే గతేడాది ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. చైనా ముందు చేయిచాపి ఎలాగో ఎమౌంట్ సెటిల్ చేసినా.. దౌత్య సంబంధాలు మాత్రం మెరుగుపడలేదు. అంతేకాదు, సౌదీ బాకీ తీర్చేందుకు అప్పుచేసి.. డ్రాగన్ కబంధ హస్తాల్లో మరింత కూరుకుపోయింది. పాకిస్తాన్ లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా క్షీణించడంతో సౌదీ అరేబియా వద్ద 4 బిలియన్ డాలర్లు అప్పు చేసింది. అయితే, అనవసరంగా సౌదీతో సంబంధాలు చెడగొట్టుకుని నాలుగు నెలల ముందే అప్పు కట్టాల్సివచ్చింది. నిజానికి, ఇమ్రాన్ ఖాన్ గద్దెనెక్కినప్పటి నుంచీ.. ఆయన పదవీకాలమంతా అప్పులతోనే గడుస్తోంది. అవసరాన్ని బట్టి విదేశాల ముందు చేయిచాచడం అలవాటైపోయింది. చేయిచాస్తే చాచాడు.. కానీ, అప్పిచ్చినవాడిని హర్ట్ చేస్తే పరిస్థితి ఎలా రివర్స్ అవుతుందో ఖాన్ సాబ్ కు ఇప్పుడు తెలిసొస్తున్నట్టుంది.