మల్టీస్టారర్ గా వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రం!

0
881
Satyadev 26, Daali Dhananjaya 26, Eashvar Karthic, Old Town Pictures Production No.1 Shoot Begins
Satyadev 26, Daali Dhananjaya 26, Eashvar Karthic, Old Town Pictures Production No.1 Shoot Begins

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం ధనంజయకు కూడా 26వ చిత్రమే. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సత్య దేవ్, ధనంజయ, నిర్మాతలు కనిపించారు. పోస్టర్‌పై కరెన్సీ నోట్లు కూడా కనిపించడం ఆసక్తికరంగా వుంది. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × 1 =