Telugu States

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో గవర్నర్‌ తమిళసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబరు 16న చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం మూడు వారాల్లోనే ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Vaartha Online Edition

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ 1961 నవంబరు 30న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. 1984లో హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 42 ఏళ్ల వయసులోనే సీనియర్‌ న్యాయవాదిగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ హైకోర్టులో అతిపిన్న వయస్కుడైన సీనియర్‌ న్యాయవాదిగా పేరుపొందారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు జడ్జిగా, 2010లో శాశ్వత జడ్జిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరిలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయి ఆగస్టు 31 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Telangana: Satish Chandra Sharma sworn in as Chief Justice of HC -  Clipper28 Digital Media

Related Articles

Back to top button