More

    ఖర్గే కాంగ్రెస్ కు భీష్ముడి వంటి వారు.. అయినా నేను నామినేషన్ ను ఉపసంహరించుకోను..!

    కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్ శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం థరూర్ విలేకరులతో మాట్లాడుతూ.. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ భీష్మ పితామహుడని, ఆయనకు ఎలాంటి అగౌరవం లేదని అన్నారు. నేను నా ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పుకొచ్చారు. “కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుండి నేను వైదొలగను, ఎందుకంటే దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కార్యకర్తలను నేను వదులుకోను, ”అని థరూర్ చెప్పారు. ప్రస్తుత వ్యవస్థలో మార్పులు తీసుకుని రావడానికి కొత్త నాయకుడు అవసరం.. పార్టీకి శక్తినివ్వగలడని భావిస్తున్నాను.. కొత్తగా ఎన్నికయ్యే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించగలడని తాను నమ్ముతున్నానని థరూర్ అన్నారు.

    ఈరోజు ఉదయం తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తన నామినేషన్ పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి AICC ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. అంతకుముందు ఉదయం, పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు శశి థరూర్ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.

    ఇక పార్టీ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఏకే ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు.

    Trending Stories

    Related Stories