భారతదేశంలో సెక్యులరిజమ్ అనేది ఒక్క హిందువులకు మాత్రమే పరిమితమైపోయింది. హిందువు అనేవాడు అన్ని మతాలను గౌరవిస్తాడు. హిందూ రాజకీయ నాయకులు, హిందూ సెలబ్రిటీల్లో చాలామంది రంజాన్ నాడు టోపీలు పెట్టుకుంటారు. క్రిస్మస్ రోజున కేకులు కట్ చేస్తారు. కానీ, ఒక ముస్లిం సెలబ్రిటీ గానీ, ఒక క్రిస్టియన్ గానీ గుడికి వెళ్లినా.. అటువైపు తొంగి చూసినా కూడా మహాపరాధంగా భావిస్తారు. వారిని రాచిరంపాన పెడతారు. అంటే సెక్యులరిజమ్ అన్నది అందరికీ వర్తించదా..? హిందువు ఒక్కడే సెక్యులర్‌గా వుండాలా..?
తాజాగా.. బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ విషయంలో ఇస్లాంవాదులు, కుహనా లౌకికవాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇటీవల ఆమె మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అత్రాంగి రే’ విడుదలకు ఒక రోజు ముందు ఆమె ఆలయాన్ని సందర్శించారు. గుడిలో సాయంత్రం ఇచ్చే హారతిలో పాల్గొనడంతో పాటు.. ఆమె దాదాపు 30 నిమిషాల పాటు ఆలయంలోనే గడిపారు. గుడిలో ఓ ఫొటో కూడా దిగారు. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘జై మహాకాల్’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ ఫొటోలో సారా అలీ ఖాన్ హిందూ సంప్రదాయ పద్దతిలో తలపాగా ధరించారు.
అయితే, ఫొటో అలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యిందో లేదో.. ఇస్లాంవాదుల వేట మొదలైంది. నువ్వసలు మనిషివేనా అంటూ ఒక్కొక్కడు మతోన్మాదంతో రగిలిపోతున్నారు. నోటికివచ్చినట్టు తిడుతున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇది ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధమంటూ సొంతమతం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటోంది సారా అలీ ఖాన్. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేస్తూ.. వామపక్ష ఉదారవాదులు, ఇస్లామిస్టులు ఇష్టం వచ్చిన రీతిలో సారాను దుర్భాషలాడుతున్నారు.
సారా అలీ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. “నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. నువ్వు అసలు ముస్లింవేనా..? దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నావు..?” అని ఒకతను పోస్ట్ చేస్తే.. మరొకరు “ముస్లిం అయిన మీరు విగ్రహారాధన ఎలా చేస్తారని” అని వ్యాఖ్యానించాడు. ఇంకో నెటిజన్ అయితే.. “నీకు సిగ్గు లేదా..? నువ్వు ముస్లిం సమాజానికే మచ్చ” అంటూ దుర్భాషలాడాడు.
ఇది ఇక్కడితో ఆగలేదు.. ఇంకొందరు ఇస్లాంవాదులైతే.. మహాకాళేశ్వరుడిని సైతం చెప్పరాని మాటలతో విమర్శించారు. ఇంకొకడు అయితే సారాను వెళ్లి గోమూత్రం తాగు అంటూ సలహా ఇచ్చాడు. సారా అలీ ఖాన్ ను విమర్శిస్తున్న లెఫ్ట్ లిబరల్, ఇస్లామిస్ట్ మూకలు.. సారా అలీ ఖాన్ తల్లి అమృతాసింగ్ సిక్కు కుటుంబం నుంచి వచ్చిందన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. అంతేకాదు, సయీఫ్ తల్లి షర్మిళా టాగూర్ హిందూ కుటుంబం నుంచి వచ్చిన మహిళ.
ఇదిలావుంటే, సారా అలీ ఖాన్ గుడికి వెళ్లడాన్ని పలువురు రైట్ వింగ్ కార్యకర్తలు, కొంతమంది పాత్రికేయులు మాత్రం సమర్థించారు. న్యూస్ అనలిస్ట్ అన్షుల్ సక్సేనా ట్వీట్ చేస్తూ, “ఇప్పుడు, రాడికల్ ఇస్లాంవాదులు నటి సారా అలీ ఖాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో దుర్భాషలాడుతున్నారు. ఎందుకంటే ఆమె ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించి దాని ఫోటోలను పోస్ట్ చేశారు. ఇది ద్వేషపూరిత ప్రసంగం కిందకు రాదు, ఇది వామపక్ష-ఉదారవాదులు, రాడికల్స్ యొక్క.. వాక్ స్వాతంత్య్రం”.
మాజీ జర్నలిస్ట్ మోనికా ట్వీట్ చేస్తూ, “మహాకాల్ ఆలయాన్ని సందర్శించినందుకు సారా అలీ ఖాన్‌పై దాడి చేస్తున్నారు. ఆమె మత స్వేచ్ఛకు ఎవరూ మద్దతు తెలపడం లేదు. ఇదేనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే..?” అంటూ ప్రశ్నించారు. హిందూ నాయకులు, సెలబ్రిటీలు రంజాన్ రోజున టోపీలు పెట్టుకున్నప్పుడు రాని ఉదారవాదుల అసహనం.. ఒక ముస్లిం గుడికెళ్లే మాత్రం వస్తుంది.
సారా అలీ ఖాన్ ఇలా ఇస్లాంవాదులకు, కుహనా లౌకివాదులకు టార్గెట్‌గా మారడం ఇదేం తొలిసారి కాదు. గత నెలలో, జాన్వీ కపూర్‌తో కలిసి హిందూ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను సందర్శించినందుకు బాలీవుడ్ నటిని ఇస్లాంవాదులు దుర్భాషలాడారు. హిందూ దేవుడైన శివుని నివాసమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించినందుకు కూడా ఆమెపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఇస్లామిస్ట్‌లు ఆమెను దుర్భాషలాడగా, మరికొందరు హిందూ మందిరాన్ని సందర్శించి విగ్రహం ముందు ప్రార్థన చేయడం ద్వారా ముస్లింలకు కళంకం తెచ్చావని ఆరోపించారు.
ఇక, 2018లో ఇలాగే ఓసారి ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఇటీవల 57వ పుట్టిన రోజు జరుపుకున్న హోంమంత్రి అమిత్ షాకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా జీర్ణించుకోలేకపోయారు. రవీంద్రనాథ్ కుటుంబానికి చెందిన షర్మిళా టాగూర్ మనవరాలు పిరికిపందలా మారిపోయిందంటే విమర్శించారు. అంతేకాదు, గత విజయదశమి పండుగ రోజున దుర్గామాతను దర్శించుకుంటే కూడా కడుపు రగిలించుకున్నారు. అసహనంతో విమర్శలు గుప్పించారు.
ఏది ఏమైనప్పటికీ, సారా అలీ ఖాన్ దేవాలయాలను సందర్శించడం, ‘జై మహాకాల్’ అని నినాదాలు చేయడం, ఆమె వ్యక్తిగత విషయం. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. ఇస్లాంవాదులు, కుహనా లౌకికవాదులు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదనేది.. అసలైన సెక్యులర్ వాదుల అభిప్రాయం.