More

    మరో క్రికెటర్ కి ప్రమాదం.. ఈ సారి రోడ్డు మీద కాదు..!

    భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఈసారి మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టలేదు.. గాయం అతడిని వెంటాడింది. శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా అతనికి అవకాశం ఇవ్వగా.. ముంబైలో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ శాంసన్ గాయపడ్డాడు. బంతిని ఆపే సమయంలో డైవ్ చేయడంతో అతని మోకాలికి దెబ్బ తగిలింది. వైద్య పరీక్షల్లో గాయం పెద్దది అని తేలిసింది. వైద్యులు అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో చివరి రెండు టీ20 మ్యాచ్ ల నుంచి శాంసన్ తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శాంసన్ స్థానంతో విదర్భకు చెందిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను సెలెక్టర్లు టీ20 జట్టులో చేర్చారని వెల్లడించింది.

    ముంబయి వేదికగా జరిగిన తొలి టి20లో రెండు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది టీమిండియా. రెండో మ్యాచ్ మహారాష్ట్రలోని పూణే మైదానంలో నిర్వహించనున్నారు. గురువారం ఇక్కడ జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌‌‌‌ను కైవసం చేసుకోవాలని హార్దిక్ పాండ్యా సేన ఎదురుచూస్తోంది. పూణే పిచ్ పేసర్లకు స్వర్గధామం కావడంతో ఎక్స్ట్రా బౌలర్ ను ఆడించే అవకాశం ఉంది. శాంసన్​ స్థానంలో రాహుల్​ త్రిపాఠిని ఆడించే అవకాశం ఉంది.

    Trending Stories

    Related Stories