More

    రాహుల్ ను టార్గెట్ చేసిన సంజయ్ రౌత్

    భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే..! కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని ఆయన ఈ యాత్ర చేస్తూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ పై చేస్తున్న విమర్శలు, అనుచిత వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని పలువురు నేతలు తప్పుబడుతూ వస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విబేధాలకు కూడా కారణమయ్యాయి.

    సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించింది ఉద్దవ్ శివసేన. ఎంవీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైందన్న వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సావర్కర్‌ను విమర్శించడం భారత్ జోడో యాత్ర అజెండా కాదని.. ఇలాంటి విమర్శలు చేస్తూ ‘భారత్ జోడో’ అంటే ఫలితం ఏం ఉంటుందని సంజయ్ రౌత్ విమర్శించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సంపాదించుకున్న పేరంతా నాశనమైందని.. సామ్నాలో రాసిన ఓ వ్యాసంలో సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను రాహుల్ ఎందుకు కదిలిస్తున్నారని, బీజేపీకి ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories