కర్ణాటకలోని బెళగాంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన నవంబర్ 6న జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం ప్రారంభించారు. అలా మాట్లాడుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. నవంబర్ 6 తన 53వ పుట్టినరోజు కావడంతో తన మఠంలో అనుచరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రసంగం సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కూర్చున్న కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు. స్వామీజీ ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న భక్తుల మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యం రికార్డు అయింది.