More

    ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే స్టార్ క్రికెటర్ అరెస్ట్

    అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్‌కు చెందిన స్టార్‌ క్రికెటర్‌ సందీస్‌ లామిచానేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నేపాల్‌ ఖట్మాండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో సందీప్‌ను నేపాల్‌ పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఖంట్మాడులోని ఒక హోటల్‌ గదిలో రేప్‌ చేశాడని 17 ఏళ్ల బాలిక ఆగస్టులో మీడియాకు వెల్లడించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. రేప్‌ ఆరోపణలు వచ్చిన తర్వాత.. అతన్ని నేపాల్‌ జాతీయ జట్టు కెప్టెన్‌గా తొలగించిన విషయం తెలిసిందే.

    ఖాట్మండులో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సందీప్ పై ఆరోపణలు వచ్చాయి. నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు నమోదు చేసినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. సందీప్ లామిచానేపై అత్యాచారం ఆరోపణలపై 17 ఏళ్ల వయస్సు గల మైనర్ కేసు నమోదు చేసిన తర్వాత నేపాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని నేపాల్ పోలీసులు గతంలో స్టేట్మెంట్ వచ్చింది. ఓ హోటల్‌లో సందీప్ లామిచానే తనపై అత్యాచారం చేశాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆగస్టు 21న జరిగింది. స్నేహితురాలి ద్వారా సందీప్ లామిచానేను కలిశానని, ఆగస్టు 17న ఇద్దరూ నాగర్‌కోట్‌కు వెళ్లామని బాలిక తెలిపింది. మరుసటి రోజు సందీప్ లామిచానే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ని ఆడేందుకు కెన్యాకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇతర టోర్నమెంట్లలో ఆడేసి.. నేపాల్ కు చేరుకున్నాడు. తాను ఎటువంటి తప్పు కూడా చేయలేదని సందీప్ చెబుతున్నాడు.

    Trending Stories

    Related Stories