More

    సనాతన ధర్మం భారతదేశ జాతీయ మతం: యోగి ఆదిత్యనాథ్

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 13న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని నాథ్ ఆలయంలో ధ్వజస్తంభం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం భారతదేశ జాతీయ మతమని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని కొంతమంది భారతీయ పౌరులు అపహాస్యం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబరు 2న చెన్నైలో జరిగిన “ఎరాడికేట్ సనాతన్ కాన్ఫరెన్స్” అనే కార్యక్రమంలో సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి.

    సనాతన ధర్మం అనేది భారత జాతీయ మతం అని, దానినెవరూ చెరిపేయలేరని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. భారత్‌లో నివసిస్తున్న కొంత మంది ఇంకా సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నారని, పురాతన కాలం నుంచీ ఇటువంటి దాడి జరుగుతూనే ఉందని అన్నారు. సనాతన ధర్మంతోపాటు దేవుడినీ ఇప్పటికీ భారత్‌లో నివశిస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. వారు భారతీయ విలువలపై ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటారన్నారు యోగి ఆదిత్యనాథ్. రావణుడూ దేవుడి ఉనికిని ప్రశ్నించడానికి ప్రయత్నించాడు. చివరకు ఏమైందని యోగి ప్రశ్నించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ముస్లింలు హజ్ కోసం మక్కాకు వెళ్ళినప్పుడు, సౌదీ అరేబియాలో వారిని హిందుస్తానీలుగా సంబోధిస్తారు, ఎందుకంటే ఇది మతానికి సంబంధిత పదం కాదు.. భారతదేశం సాంస్కృతిక వందనానికి చిహ్నమని అన్నారు. భారతదేశం వాస్తవికతను తుడిచివేయడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలిపారు.

    బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను అభినందించారు యోగి ఆదిత్యనాథ్. “బ్రిటన్ ప్రధానమంత్రి పూర్వీకులు మూడు తరాల క్రితం వలస వెళ్లారు. రిషి సునక్ ఇప్పటికీ తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది వారు అనుసరిస్తున్న వారసత్వ సంప్రదాయాలు, ఆచారాలకు సంబంధించినది. హిందువు అయినందుకు గర్విస్తున్నాడు. గుడికి వెళ్లడం, గోమాతను పూజించడం, సాధువుల సమక్షంలో కూర్చొని జై శ్రీరామ్ అని చెప్పడానికి ఆయనకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే ఆయన వారసత్వం సనాతన ధర్మ మూలాలతో ముడిపడి ఉంది. ” అని అన్నారు యోగి ఆదిత్యనాథ్.

    Related Stories