More

    యశోద ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం.. సమంత ఆరోగ్యంపై క్లారిటీ

    సమంత నటించిన ‘యశోద’ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ ను తెచ్చుకుంది. ఈ సినిమాను ఓటీటీలో త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తాజాగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యశోద సినిమాను ఓటీటీలో నిషేధించాలని కోర్టు తెలిపింది. ఇవా ఐవీఎఫ్ హాస్పిటల్ యాజమాన్యం మూవీ రిలీజ్ ను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యశోద సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఈవా అని పేరు పెట్టారు. సినిమాలో తమ ఆస్పత్రి పేరు చూపించడం వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ సదరు హాస్పిటల్ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో సిటీ కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసి డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది.

    నటి సమంత ఆరోగ్యంపై మరోసారి చర్చ:

    సమంత మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్నానని కొద్దిరోజుల కిందట చెప్పిన సంగతి తెలిసిందే..! తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని వార్తలు మొదలయ్యాయి. సమంత హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. సమంతకు ఏమీ కాలేదని.. సమంత ఆసుపత్రిలో చేరిందనే వార్తలు పుకార్లే అని సమంత సన్నిహితులు కొట్టిపారేశారు. ఆమె ఇంటి వద్దనే క్షేమంగా ఉందని సమంత మేనేజర్ కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు.

    Trending Stories

    Related Stories