ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు జనగణమన పాడడం రాలేదు. జనగణమన పాడడం తెలియక సదరు నాయకుడు మాత్రమే కాకుండా అతడి అనుచరులు కూడా దిక్కులు చూశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మొరాదాబాద్‌లో జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్, అతని మద్దతుదారులు జాతీయ గీతంలోని పదాలను మర్చిపోయారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాక ‘జన గణ మన’ మొదటి చరణాన్ని పాడారు. ఆ తరువాత వాటిని మరచిపోయారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హసన్ నవాబ్ మజ్జు ఖాన్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు, అనంతరం గుల్ షాహిద్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
మొదట గట్టిగా పాడిన నాయకుడు ఆయన అనుచరులు.. ఆ తర్వాత పదాలు గుర్తుకు రాక ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. చివరికి పాడేశామని భావించి.. జయహే.. జయహే అంటూ ముగించేశారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది కూడా పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తరచూపులు చూశారు.