సల్మాన్ ఖాన్ డూప్ ను అరెస్టు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు

0
714

హీరోలను పోలిన వ్యక్తులు చాలా మందే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి వారికి మంచి డిమాండ్ ఉంది. వారు రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులలో ఆజం అన్సారీ కూడా ఒకడు. అతడు కొన్ని యాంగిల్స్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాగా ఉంటాడు. సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డూప్లికేట్ సల్మాన్ ఖాన్ లాగా పేరుగాంచిన ఆజం అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. బహిరంగ ప్రదేశంలో శాంతికి విఘాతం కలిగించినందుకు అరెస్టు చేశారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్లాక్ టవర్‌పై రీల్స్ తీస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు సెక్షన్ 151 కింద అతడికి చలాన్ కూడా జారీ చేయబడింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అన్సారీ తరచూ రోడ్డు మధ్యలో వీడియోలను చేసేవాడు. అర్ధ నగ్నంగా, బహిరంగంగా సిగరెట్ తాగుతూ రీల్స్ వీడియోలు చేస్తూ ఉండేవాడు. నకిలీ సల్మాన్ ఖాన్‌ను చూసేందుకు రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద అతడిపై కేసు పెట్టారు. అతడికి యూట్యూబ్‌లో 1,67,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, అతని వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.