More

    అనారోగ్యంతో బాధపడుతున్న సల్మాన్

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌లో కనిపించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 16కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ కనిపించలేదు. కరణ్ జోహార్ ఆ బాధ్యతలను తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ తన హోస్టింగ్ బాధ్యతల నుండి అకస్మాత్తుగా ఎందుకు విరామం తీసుకున్నాడోనని చాలా మంది ఆరాతీయగా.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. సల్మాన్‌కు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను కోలుకునే వరకు బిగ్ బాస్ ఎపిసోడ్‌లను హోస్ట్ చేయడం లేదు. బిగ్ బాస్ 16 హోస్ట్‌గా సల్మాన్ స్థానాన్ని కరణ్ తీసుకోనున్నారు.

    సినిమాల పరంగా కూడా సల్మాన్ ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు. అక్టోబర్ 25న సల్మాన్ ఖాన్ తన సినిమా షూటింగ్ కు హాజరవ్వనున్నాడు. సల్మాన్ సన్నిహితుడు ఈటీమ్స్‌తో మాట్లాడుతూ, “సల్మాన్ కోలుకుంటున్నాడు. సల్మాన్ కొత్త త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది.” అని తెలిపినట్లుగా కథనాలు వచ్చాయి. సల్మాన్ ఇంట్లో ఉండగా, అతని హోమ్ ప్రొడక్షన్స్ లో భాగంగా సినిమా షూటింగ్ ఇతర నటీనటులతో ముంబైలోని విలే పార్లేలోని గోల్డెన్ టొబాకోలో కొనసాగుతోంది. సల్మాన్ మళ్లీ సెట్‌ లోకి వెళ్లి తన సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాడు.

    Trending Stories

    Related Stories