అక్కడ పానీపూరి అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా..?

0
768

పానీ పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు.. అన్నీ రకాల రుచులను కలిగి ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తింటారు..నార్త్ ఇండియా లో ఫెమస్ అయ్యిన ఈ పానీపూరి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

అయితే సుచి, శుభ్రత ఉంటే పర్వాలేదు కానీ ఎలా పడితే అలా ఉంటే మాత్రం అనేక రోగాలను కూడా తెస్తుంది. ఇప్పుడు ప్రబలుతున్న రోగాల కారణంగా ఓ ప్రాంతంలో అస్సలు పానీపూరి అనేది కనిపించకుండా నిషేదించింది ఓ ప్రభుత్వం. ఖాట్మండు వ్యాలీలోని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు స్థానికంగా కలరా కేసులు పెరగడంతో పానీపూరీ అమ్మకాలను నిషేధించారు. ఇక్కడ ఇప్పటి వరకు 12 కలరా కేసులు నమోదయ్యాయి. పానీపూరీ విక్రయాలు, పంపిణీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు నగర పాలక సంస్థ తెలిపింది. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, కారిడార్ ప్రాంతాల్లో పానీపూరీ విక్రయాలను నిలిపివేయించేందుకు సన్నాహాలు చేశామని, లోయలో కలరా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నగర పోలీసు అధికారులు తెలిపారు.

ఖాట్మండు లోయలో మరో ఏడుగురికి కలరా సోకడంతో, మొత్తం కలరా రోగుల సంఖ్య ఇప్పటివరకు 12కి చేరుకుంది. ఎపిడెమియాలజీ అండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ చుమన్‌లాల్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఖాట్మండు మహానగరంలో ఐదు కలరా కేసులు, చంద్రగిరి మునిసిపాలిటీ, బుధానీలకంఠ మునిసిపాలిటీలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఎవరికైనా కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎటువంటి వ్యాధులు వచ్చిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలని అధికారులు కోరుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 + 14 =