More

    ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తున్నాం: సజ్జల

    ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చన్నారు. ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించామని తెలిపారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలన్నారు.

    Trending Stories

    Related Stories